రూ. కోటి బీమా కోసం సోదరుడిని సుత్తితో కొట్టి చంపేశాడు: భార్య విషయం చెప్పింది !

రూ. ఒక కోటి రూపాయలు బీమా చేసిన సోదరుడిని చంపేస్తే ఆ డబ్బు నాకేవస్తోందని భావించి అతన్ని దారుణంగా హత్య చేసిన వ్యక్తిని కర్ణాటకలోని హుబ్బళి జిల్లాలోని కుందగోళ పోలీసులు అరెస్టు చేశారు. హుబ్బళి సమీపంలోని క

బెంగళూరు: రూ. ఒక కోటి రూపాయలు బీమా చేసిన సోదరుడిని చంపేస్తే ఆ డబ్బు నాకేవస్తోందని భావించి అతన్ని దారుణంగా హత్య చేసిన వ్యక్తిని కర్ణాటకలోని హుబ్బళి జిల్లాలోని కుందగోళ పోలీసులు అరెస్టు చేశారు. హుబ్బళి సమీపంలోని కుందేగళు తాలుకా సంశి గ్రామానికి చెందిన శివరాజ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.

శివరాజ, నాగరాజ సోదరులు. నాగరాజ తన పేరు మీద రూ. ఒక కోటి బీమా చేశాడు. ఈ విషయం శివరాజకు తెలిసింది. నాగరాజ తన నామినీగా సోదరుడు శివరాజ పేరు పెట్టాడని సమాచారం. నాగరాజను హత్య చేస్తే బీమా డబ్బులు తనకే వస్తోందని శివరాజ ప్లాన్ వేశాడు.

ఇటీవల నాగరాజ బైక్ మీద వెలుతుంటే రోడ్డు ప్రమాదం జరిగిందని, ఆయన మరణించాడని శివరాజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగరాజ్ తల మీద బలమైన గాయం అయ్యిందని, శరీరంలో ఎక్కడా గాయాలు లేవని వైద్యులు పోస్టుమార్టుం నివేదిక ఇవ్వడంతో పోలీసులకు అనుమానం వచ్చింది.

 Nagaraja Kodliwada murdered by his brother Shivaraja Kodliwada for one crore rupees insurance money.

పోలీసులు నాగరాజ్ భార్యను విచారించారు. తన భర్తను ఆయన సోదరుడు శివరాజ హత్య చేసి ఉంటాడని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. పోలీసులు శివరాజను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఆ సమయంలో శివరాజ అసలు విషయం చెప్పాడు.

నాగరాజ తన పేరు మీద రూ. ఒక కోటీ బీమా చేశాడని, నామినీగా తన పేరు ఉందని చెప్పాడు. నాగరాజ చనిపోతే బీమా డబ్బు నాకే వస్తోందని భావించానని అంగీకరించాడు. నాగరాజ్ కు పీకలదాక మద్యం సేవించి అతను నిద్రపోతున్న సమయంలో సుత్తితో తల మీద పదేపదే దాడి చెయ్యడంతో మరణించాడని శివరాజ అంగీకరించాడు.

హత్య చేసిన తరువాత వాటర్ ట్యాంక్ లో నాగరాజ మృతదేహాన్ని తీసుకు వెళ్లి జాతీయ రహదారిలో పడేసి రోడ్డు ప్రమాదం జరిగిందని నమ్మించడానికి ప్రయత్నించానని శివరాజ అంగీకరించాడని పోలీసులు చెప్పారు. బీమా డబ్బుల కోసం సోదరుడిని హత్య చేసిన నిందితుడిని జైలుకు పంపించామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+