నాకు బలవంతంగా ముద్దు పెట్టలేదు!: నగ్మా (పిక్చర్స్)
లక్నో: ప్రముఖ సినీ నటి, ఉత్తర ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ లోకసభ అభ్యర్థి నగ్మాకు అదే పార్టీకి చెందిన హపూర్ శాసన సభ్యుడు గజరాజ్ సింగ్ ముద్దుపెట్టినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
దీనిపై నగ్మా స్పందించారు. తనకు ఎవరు కూడా బలవంతంగా ముద్దు పెట్టలేదని ఆమె చెప్పారు. ముద్దు పెట్టడంపై స్పందిస్తూ... అలాంటిదేం జరగలేదని, అవన్నీ అవాస్తవాలని, ఇలాంటి రూమర్స్ ఎందుకు వ్యాపిస్తాయో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
కాగా, ఎమ్మెల్యే గజరాజ్ సింగ్ ఆ సమయంలో నగ్మా చెవిలో ఏదో చెప్పాలని చూశారని స్థానిక కాంగ్రెసు పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే, ఆయన చెప్పిన విషయాన్ని వినేందుకు నగ్మా ఆసక్తి చూపలేదని, అందుకే ఆయన చేయిని తీసేసి, ఆమె విసురుగా వెళ్లిపోయారంటున్నారు.

నాకు బలవంతంగా ముద్దు పెట్టలేదు!: నగ్మా
ఎమ్మెల్యే అసభ్యంగా ప్రవర్తించకుంటే నగ్మా ప్రచారం కార్యక్రమం నుండి విసురుగా ఎందుకు వెళ్లారని ప్రశ్నిస్తే... ఆమె వెళ్లిపోయినప్పటికీ కొద్ది నిమిషాల్లోనే తిరిగి వచ్చి ప్రచారంలో పాల్గొన్నారని చెబుతున్నారు.

నాకు బలవంతంగా ముద్దు పెట్టలేదు!: నగ్మా
ఎన్నికల ప్రచారం కాబట్టి భారీగా జనాలు వస్తుంటారని, ఆ సమయంలో ఒకరు చెప్పేది మరొకరికి స్పష్టంగా వినిపించదని, అందుకే గజరాజ్ ఆమెకు చెవిలో చెప్పబోయారని, ఆయన చెప్పేది వినడం ఇష్టం లేకనే నగ్మా వెళ్లిపోయారంటున్నారు.

నాకు బలవంతంగా ముద్దు పెట్టలేదు!: నగ్మా
గజరాజ్ సింగ్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని, ఆయన తనను సొంత కూతురులా చూసుకుంటారని నటి నగ్మా చెప్పుకొస్తున్నారు.

నాకు బలవంతంగా ముద్దు పెట్టలేదు!: నగ్మా
తాను కొద్దిసేపు మాత్రమే అక్కడి నుండి వెళ్లిపోయానని, ఆ తర్వాత తిరిగి వచ్చి ప్రచారంలో పాల్గొన్నానని నగ్మా చెప్పారు. కాగా, నాలుగు రోజుల క్రితం గజరాజ్ సింగ్.. నగ్మా పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications