కాంగ్రెసు రెండో జాబితా: మీరట్ నుంచి నటి నగ్మా

న్యూఢిల్లీ: వచ్చే లోకసభ ఎన్నికలకు 71 మంది అభ్యర్థులతో కాంగ్రెసు రెండో జాబితాను విడుదల చేసింది. సినీ నటులు రాజ్ బబ్బర్, నగ్మా ఈ జాబితాలో చోటు చేసుకున్నారు. ఈ జాబితాలో 35 శాతం మంది యువకులు, 11 మంది మహిళలు ఉన్నారు. సినీ నటి నగ్మా మీరట్ నుంచి పోటీ చేయనున్నారు.

సినీ నటుడు రాజ్ బబ్బర్ ఘజియాబాద్ నుంచి లోకసభకు పోటీ చేయనున్నారు. రీటా బహగుణకు లక్నో సీటు కేటాయించారు. నూర్ బానో మొరాదాబాద్ లోకసభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. సిట్టింగ్ ఎంపీ మొహమ్మద్ అజరుద్దీన్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి ఈసారి లోకసభకు పోటీ చేయనున్నారు.

Nagma to contest from meerut

యువజన కాంగ్రెసు అధ్యక్షుడు రాజీవ్ సతావ్ మహారాష్ట్రలోని హింగోలీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు. యువజన కాంగ్రెసు నుంచి సతావా కాకుండా మరో ఎనిమిదికి టికెట్లు లభించాయి. యువతకు ఈ జాబితాలో ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది.

కాంగ్రెసు విడుదల చేసిన అభ్యర్థుల మొదటి జాబితాలో క్రికెటర్ మొహమ్మద్ కైఫ్, నీలేకని ఉన్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పేర్లు కూడా మొదటి జాబితాలో చోటు చేసుకున్నాయి. మొదటి జాబితా 194 మంది అభ్యర్థులతో ఇంతకు ముందు విడుదలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+