నేను కొట్లేదు, మీదకు వస్తే తోసేశాను: నగ్మా యూ టర్న్

న్యూఢిల్లీ: తాను ఓ వ్యక్తి పైన చేయి చేసుకున్నట్లు వచ్చిన వార్తలను ప్రముఖ సినీ నటి, మీరట్ కాంగ్రెసు పార్టీ లోకసభ అభ్యర్థి నగ్మా కొట్టి పారేశారు. తాను ఎవరిని కొట్టలేదని, తన మీదకు వచ్చిన వారిని మాత్రమే పక్కకు తోశానని నగ్మా వివరణ ఇచ్చారు. అదే సమయంలో ఓ ప్రజాప్రతినిధి తనను ముద్దు పెట్టుకున్నట్లుగా వచ్చిన వార్తలను కూడా ఆమె ఖండిస్తూనే ఉన్నారు. నగ్మా తనకు ఎదురైన చేదు అనుభవాలపై యూ టర్న్ తీసుకోవడం గమనార్హం.

నటి నగ్మాకు ఎన్నికల ప్రచారంలో వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్న విషయం తెలిసిందే. అభిమానుల పేరిట వెంటపడే ఆకతాయిల చేష్టలతో ఆమె భయపడిపోతున్నారు. ప్రచారంలో మరీ శ్రుతి మించి ప్రవర్తించిన ఓ వ్యక్తిని ఇటీవల ఆమె చెంప చెళ్లుమనిపించారు.

Nagma Denies Being Kissed, Groped; Says She Didn't Slap Anyone!

మరోవైపు సొంత పార్టీ నేతలతోనూ నగ్మాకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో దిగిన ఆమె, ప్రచారమైతే ఆర్భాటంగా ప్రారంభించారు, కానీ ఆది నుంచి ఆమెకు అన్నీ కష్టాలే. అందుకే ఇప్పుడు రక్షణ కోసమని ఆమె సొంతంగా బౌన్సర్లని ఏర్పాటు చేసుకున్నారు.

ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటుతో ప్రచారానికి వెళ్తున్నారట. నగ్మా సినీ నటి కావడంతో దాదాపు వెళ్లిన చాలాచోట్ల అభిమానులు, ఇతరుల నుండి ఆమె సమస్య ఎదుర్కొంటున్నారు. ఈ విషయాలను ఆమె కాంగ్రెస్ పార్టీకి వివరించింది. దీంతో, తమ అభ్యర్థి రక్షణకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఈసీని కూడా కోరిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+