కమల్ హాసన్ తో నటి నగ్మా భేటీ: కాంగ్రెస్ నాయకుల గాలం, చెప్పిన రెండు రోజులకే ఎంట్రీ !
కొంత కాలంగా రాజకీయాల గురించి సీరియస్ గా మాట్లాడుతూ తమిళనాడు ప్రభుత్వం మీద, మంత్రుల మీద మండిపడుతున్న బహుబాష నటుడు, నిర్మాత, దర్శకుడు కమల్ హాసన్ కు కాంగ్రెస్ పార్టీ నాయకులు .
చెన్నై: కొంత కాలంగా రాజకీయాల గురించి సీరియస్ గా మాట్లాడుతూ తమిళనాడు ప్రభుత్వం మీద, మంత్రుల మీద మండిపడుతున్న బహుబాష నటుడు, నిర్మాత, దర్శకుడు కమల్ హాసన్ కు కాంగ్రెస్ పార్టీ నాయకులు గాలం వేస్తున్నారని వెలుగు చూసింది.
కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు, నటి నగ్మా సోమవారం చెన్నైలోని అళ్వార్ పేట్ లోని కమల్ హాసన్ ఇంటికి వెళ్లి రహస్యంగా చర్చలు జరిపారు. కమల్ హాసన్, నగ్మా మాత్రమే ఏకాతంగా చర్చలు జరిపడంతో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చెయ్యడం గ్యారెంటీ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

దాదాపు రెండు గంటల పాటు కమల్ హాసన్, నగ్మా రాజకీయాల గురించి చర్చించారని తెలిసింది. తాను మర్యాదపూర్వకంగా కమల్ హాసన్ ను కలిశానని నగ్మా అంటున్నారు. తాను కచ్చితంగా బీజేపీలో చేరనని కమల్ హాసన్ ఇటీవల చెప్పారు.
మూడు రోజుల క్రితం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను కలిసిన కమల్ హాసన్ రాజకీయాల గురించి సలహాలు, సూచనలు ఇవ్వాలని మనవి చేసిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్న కమల్ హాసన్ త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications