అసభ్యత: నగ్మాకు సెక్యూరిటీ పెంచాలని కాంగ్రెస్ లేఖ

లక్నో/న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో మీరట్ నుంచి పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థి ప్రముఖ సినీ నటి నగ్మాకు రక్షణ కల్పించేందుకు సెక్యూరిటీని పెంచాలంటూ ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది. మీరట్‌లో ఎన్నికల ప్రచారం చేస్తున్న నగ్మాను సినీ నటి కావడంతో పలువురు ఆమెను పట్టుకునేందుకు, చూసేందుకు పోటీ పడుతున్నారు.

కాంగ్రెసు పార్టీలో చేరిన నగ్మాకు అధిష్టానం మీరట్ లోకసభ టిక్కెట్ ఇచ్చింది. నామినేషన్ దాఖలు, ఎన్నికల ప్రచార సమయాల్లో ఆమెకు రెండుమూడుసార్లు చేదు అనుభవం ఎదురయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ నగ్మాకు మరింత సెక్యూరిటిని అడిగినట్లుగా భావించవచ్చు.

Nagma needs more security, Congress tells EC

పది రోజుల క్రితం నగ్మాను సొంత పార్టీకి చెందిన హపూర్ శాసన సభ్యుడు ఒకరు ముద్దు పెట్టుకునే ప్రయత్నాలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత దానిని నగ్మా కొట్టి పారేశారు. ఎమ్మెల్యే గజరాజ్ సింగ్ తనను కూతురులా చూస్తారని, ఆయన తన చెవిలో ఏదో చెప్పే ప్రయత్నం చేశారని అన్నారు.

ఆ తర్వాత ఐదు రోజుల క్రితం ఓ యువకుడు నగ్మాను తాకాడు. దీంతో ఆగ్రహం వచ్చిన నగ్మా అతని చెంప పైన ఒక్కటి ఇచ్చింది. ఇది కలకలం రేపింది. ఈ ఘటన అనంతరం ఆమె సొంతగా బాడీగార్డ్స్‌ను పెట్టుకొని ప్రచారం చేస్తున్నట్లుగా సమాచారం. ఇప్పుడు కాంగ్రెసు అదనపు భద్రత కోరింది.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/VL4YZzeVnv4?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+