తాకిన యూత్, చెంప చెల్లుమనిపించిన నగ్మా: మళ్లీ చేస్తే
లక్నో: ప్రముఖ నటి, మీరట్ కాంగ్రెసు పార్టీ లోకసభ అభ్యర్థి నగ్మా గురువారం ఓ యువకుడి చెంప వాయించారు. మీరట్‌లో ఎన్నికల ర్యాలీ సందర్భంగా ఓ యువకుడు ఆమెను తాకాడు. దీంతో ఆగ్రహం పట్టలేకపోయిన నగ్మా అతని చెంపను చెల్లుమనిపించింది. ఈ సంఘటనకు ఒక్కసారిగా అందరూ ఆశ్యర్యపోయారు.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ నుంచి కాంగ్రెస్ లోకసభ అభ్యర్థిగా నగ్మా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ర్యాలీ నిర్వహించింది. నగ్మాను చూడ్డానికి జనాలు ఎగబడ్డారు. భారీ సంఖ్యలో అభిమానులు ఆమెను చూడాలని వచ్చారు.
వారిని అదుపు చేయడం భద్రతా సిబ్బందికి కష్టతరంగా మారింది. ఈ సమయంలోనే ఆమెను దగ్గర నుంచి చూడాలని ఓ యువకుడు ఆమెను తాకేశాడు. దీంతో నగ్మా కోపం తారాస్థాయికి చేరింది. ఆ యువకుడి చెంపను చెల్లుమనిపించింది. ఇంకోసారి ఇలాంటి ఘటన జరిగితే మీరట్‌లో అడుగుపెట్టనని ఘటన అనంతరం నగ్మా వ్యాఖ్యానించింది.
కాగా, ఐదు రోజుల క్రితం హపూర్ శాసన సభ్యుడు గజరాజ్ సింగ్... నగ్మాతో అసభ్యంగా ప్రవర్తించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై నగ్మా స్పందించారు కూడా. గజరాజ్ సింగ్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని, కూతురులా చూస్తారని చెప్పారు. అయితే, ఇప్పుడు ఓ యువకుడు ఆమెను తాకడంతో ఆమె చేయి చేసుకోవడం గమనార్హం.

నగ్మా
ప్రముఖ నటి, మీరట్ కాంగ్రెసు పార్టీ లోకసభ అభ్యర్థి నగ్మా గురువారం ఓ యువకుడి చెంప వాయించారు. మీరట్‌లో ఎన్నికల ర్యాలీ సందర్భంగా ఓ యువకుడు ఆమెను తాకాడు.

నగ్మా
దీంతో ఆగ్రహం పట్టలేకపోయిన నటి నగ్మా అతని చెంపను చెల్లుమనిపించింది. ఈ సంఘటనకు ఒక్కసారిగా అందరూ ఆశ్యర్యపోయారు.

నగ్మా
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ నుంచి కాంగ్రెస్ లోకసభ అభ్యర్థిగా నగ్మా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ర్యాలీ నిర్వహించింది.

నగ్మా
నగ్మాను చూడ్డానికి జనాలు ఎగబడ్డారు. భారీ సంఖ్యలో అభిమానులు ఆమెను చూడాలని వచ్చారు. వారిని అదుపు చేయడం భద్రతా సిబ్బందికి కష్టతరంగా మారింది.

నగ్మా
ఈ సమయంలోనే ఆమెను దగ్గర నుంచి చూడాలని ఓ యువకుడు ఆమెను తాకేశాడు. దీంతో నగ్మా కోపం తారాస్థాయికి చేరింది. ఆ యువకుడి చెంపను చెల్లుమనిపించింది.

నగ్మా
ఇంకోసారి ఇలాంటి ఘటన జరిగితే తాను మీరట్‌లో అడుగుపెట్టనని ఈ సంఘటన జరిగిన అనంతరం నగ్మా వ్యాఖ్యానించడం గమనార్హం.

నగ్మా
కాగా, ఐదు రోజుల క్రితం హపూర్ శాసన సభ్యుడు గజరాజ్ సింగ్... నగ్మాతో అసభ్యంగా ప్రవర్తించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

నగ్మా
ఆ ఘటనపై నగ్మా స్పందించారు కూడా. గజరాజ్ సింగ్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని, కూతురులా చూస్తారని చెప్పారు. అయితే, ఇప్పుడు ఓ యువకుడు ఆమెను తాకడంతో ఆమె చేయి చేసుకోవడం గమనార్హం.

నగ్మా
కాగా, గజరాజ్ సింగ్‌కు సంబంధించిన అంశంపై డిఎంకె నేత ఖుష్బూ స్పందిస్తూ... నగ్మా స్థానంలో తాను ఉంటే చెంప వాయించేదినని చెప్పారు. ఇప్పుడు యువకుడి పైన నగ్మా అదే చేయడం విశేషం.












Click it and Unblock the Notifications