శెభాష్ నాగ్‌పూర్ పోలీస్:డీసీపీ సహా 60 మంది ఖాకీలకు జనం పూలవర్షం,చప్పట్లు కొట్టి అభినందనలు..(వీడియో)

కరోనా వైరస్ వ్యాపిస్తోన్న నేపథ్యంలో పోలీసులు రేయనక పగలనక కష్టపడుతున్నారు. సామాజిక దూరం పాటించి ఇంట్లోనే ఉండాలని కోరుతున్నారు. అలా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ప్రజలను కోరగా.. జనం కూడా జేజేలు పలికారు. పోలీసుల ప్రత్యేక శ్రద్ధకు కృతజ్ఞతగా అభిమానాన్ని చాటారు.

Recommended Video

    Lockdown : Watch Nagpur Residents Shower Flowers, Cheer Police Man During Route March

    నాగ్‌పూర్‌లోని గిట్టిఖాదన్ వద్ద మంగళవారం పోలీసులు రూట్ మార్చ్ నిర్వహించారు. డీసీపీ వినితా సాహు నేతృత్వంలో 60 మంది పోలీసులు వైరస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. జనం ఇంట్లో ఉండాలని, సామాజిక దూరం పాటించాలని కోరారు. అలా వారు ప్రజల మంచికి చెబుతుండగా జనం చప్పట్లతో హోరెత్తించారు. శెభాష్ పోలీసు అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. మరికొందరు పోలీసులపై పూలవర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకొన్నారు.

    Nagpur Residents Shower Flowers, Cheer Cops Amid Coronavirus Lockdown

    ప్రజలు చూపించిన అభిమానం, ఆప్యాయతను పోలీసులు సోషల్ మీడియా ట్వీట్టర్‌లో వీడయో పోస్ట్ చేశారు. డీసీపీ వినితా సాహు నేతృత్వంలో చేసిన మంచి పనిని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. నాగ్‌పూర్ ప్రజలకు ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు. ఆపత్కాలంలో మీరు అందిస్తున్న సహకారాన్ని మరవలేం అని పేర్కొన్నారు.

    వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లొద్దని.. ఒకవేళ వెళితే తప్పకుండా మాస్క్ ధరించాలని సూచించారు. తమ ఇంటి వద్ద, పరిసరాల్లో పరిశుభ్రత ఉంచేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సజెస్ట్ చేశారు.

    https://telugu.oneindia.com/news/telangana/top-25-ips-list-in-the-country-telangana-dgp-in-the-top-4-266589.html

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+