షాక్.. నాగ్‌పూర్‌ విద్యార్థికి యుఏఈ అబుధాబిలో నీట్ సెంటర్: అట్టర్ ఫెయిల్యూర్: రాహుల్

దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే నీట్ యూజీ రీ-ఎగ్జామినేషన్‌కు జాతీయ పరీక్షల సంస్థ (NTA) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం జరగనున్న ఈ పరీక్షను అత్యంత పారదర్శకంగా, సురక్షితంగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహించడమే లక్ష్యంగా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. రాబోయే ఈ రీఎగ్జామ్‌కు దేశ విదేశాల నుంచి రికార్డు స్థాయిలో అభ్యర్థులు హాజరవుతున్నారు.

ఈ పరీక్షల నిర్వహణ తీరుపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ప్రతిష్టాత్మక విద్యా ప్రవేశాల కోసం నిర్వహించే నీట్-యూజీ రీ ఎగ్జామినేషన్ చుట్టూ ఉన్న గందరగోళాన్ని ఆయన ఎండగట్టారు. రీటెస్ట్ లో కూడా పరిస్థితులు మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక సాంకేతిక సమస్యలు ఇప్పటికీ తొలగిపోవట్లేదని చెప్పారు. దీనికి ఉదాహరణను చూపించారు.

Nagpur Student Faces NEET Center in Abu Dhabi After Downloading Admit Card Calls for NTA Accountability

మహారాష్ట్ర నాగ్‌పూర్‌కు చెందిన ఓ నిరుపేద విద్యార్థికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అబుధాబిలో ఎగ్జామ్ సెంటర్ పడటాన్ని రాహుల్ గాంధీ తప్పుపట్టారు. ఇక్కడి విద్యార్థికి విదేశాల్లో రీటెస్ట్ సెంటర్ కేటాయించడంపై కేంద్ర ప్రభుత్వం, ఎన్‌టీఏ నిర్లక్ష్య వైఖరిని వేలెత్తి చూపారు. బాధిత విద్యార్థి గత నెల రోజులుగా నీట్ రీఎగ్జామ్ రాసేందుకు రాత్రింబగళ్లు కష్టపడి చదివాడని, తీరా పరీక్షకు ఒక్క రోజు ముందు తన హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోగా, అందులో పరీక్షా కేంద్రం అబుదాబి ఉన్నట్లు తేలిందని అన్నారు.

దీంతో ఆ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. పాస్‌పోర్ట్ లేకపోవడం, చివరి నిమిషంలో విదేశాలకు వెళ్లేందుకు అవసరమైన డబ్బులు కూడా ఖర్చు పెట్టేంత స్థోమత ఆ విద్యార్థి లేదని, అన్ని అర్హత ఉన్నా పరీక్ష రాయలేకపోతున్నాడని రాహుల్ గాంధీ ఎక్స్‌ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి దారుణమైన లోపాల వల్ల విద్యార్థులు ఎంతటి తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతారో పాలకులు ఊహించగలరా అని ప్రశ్నించారు.

సొంత నగరంలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించలేని ఈ నిస్సహాయ విద్యా వ్యవస్థకు, దేశంలో పరీక్షలు నిర్వహించే అర్హత ఏమాత్రం లేదని ఆయన ఘాటుగా విమర్శించారు. ఎన్‌టీఏ వ్యవహరిస్తున్న తీరు దేశంలోని కోట్లాది మంది ప్రతిభావంతులైన విద్యార్థులతో పాటు వారి కుటుంబాల సహనానికి పెద్ద పరీక్షగా మారిందని అన్నారు. ఒక తరం యువత అమూల్యమైన సమయాన్ని, శ్రమను, తల్లిదండ్రుల కష్టార్జితాన్ని నిర్దాక్షిణ్యంగా దోచుకునే దోపిడీగా మారిందని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+