స్నేహితులే కదా అని నమ్మి వారి వెంట వెళ్లితే... వారు ఆ యువతిని...

తోటి స్నేహితులే కదా అని నమ్మి వారి వెంట వెళ్లిన పాపానికి ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం బయటికి తెలిసి ఎక్కడ పోలీస్‌ కేసు అవుతుందోనని భయపడి యువతిని దారుణంగా హతమార్చారు.

నాగ్‌పూర్‌: తోటి స్నేహితులే కదా అని నమ్మి వారి వెంట వెళ్లిన పాపానికి ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం బయటికి తెలిసి ఎక్కడ పోలీస్‌ కేసు అవుతుందోనని భయపడి యువతిని దారుణంగా హతమార్చారు.

ఆ తరువాత వారికి భయం పట్టుకుంది. అసలే ఆ యువతి పోలీసు అధికారి కూతురు కావడంతో బాగా ఆలోచించి ఆమె శవాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించారు. ఆ యువతి మృతదేహాన్ని ఓ సూట్‌కేసులో ఇరికించి దాన్ని ఓ చెరువులో పారేశారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

 Nagpur woman killed after rape, body stuffed in suitcase.. friend among three arrested

నాగ్‌పూర్‌కు చెందిన అసిస్టెంట్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌(ఏపీఐ) కుమార్తె (22) ఇంజినీరింగ్‌ పట్టా తీసుకునేందుకు పూణె వెళ్లింది. పని ముగించుకొని తిరిగి వస్తుండగా.. ఆమెతో చదువుకున్న నికిలేశ్‌ పాటిల్‌, నీలేశ్‌ కారులో వెళ్తూ దింపుతామని ఎక్కించుకున్నారు.

కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఆమెను వేరే ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం పోలీసులకు భయపడి ఆమెను చంపేశారు. శవాన్ని కనిపించకుండా చేసేందుకు ఆమె మృతదేహాన్ని మరో స్నేహితుడు అక్షయ్‌ సహాయంతో సూట్‌కేసులో ఇరికించి ఓ చెరువులో పడేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. బాధితురాలిపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+