జైల్లో జయ: నటి కంటతడి, సన్ టీవీ లోగో తొలగించి...
బెంగళూరు: అక్రమాస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న విషయం తెలిసిందే. జయలలిత జైలుకు వెళ్లడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకుంటున్న విషయం తెలిసిందే.
ప్రముఖ నటి నళిని కూడా జయ కోసం కంటతడి పెట్టారు. జయలలిత జైలు నుండి త్వరగా రావాలని ఆమె ఆకాంక్షించారు. జయలలితా! త్వరగా జైలు నుండి రా.. అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తోంది.

లోగో తొలగించి...
జయలలిత జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. కాగా, జయలలిత న్యూస్‌ను కవర్ చేస్తున్న సన్ టీవీ నెట్ వర్క్ తమ టీవీ లోగోను తొలగించి మరీ రిపోర్టింగ్ చేస్తున్నారని సమాచారం. రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో సన్ టీవీ రిపోర్లు తమ మైకులకు ఉండే లోగోను తొలగిస్తున్నారట.












Click it and Unblock the Notifications