రాజకీయాల్లోకి వస్తా, షాకిస్తా: నటి నమిత
చెన్నై: అందాల నటి నమిత రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నారు. తద్వారా ఆమె తన జీవితంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. త్వరలోనే తాను రాజకీయాల్లోకి వస్తానని ఆమె చెప్పారు. తనకు తమిళ ప్రేక్షకులు ప్రత్యేకతను ప్రసాదించారని చెప్పారు.
తమిళులు తనకు గుర్తింపునిచ్చారని అన్నారు. అందుకే తమిళ ప్రజలకు మంచి చేసేందుకైనా రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. తనది గుజరాత్ రాష్ట్రమే అయినా సరికొత్త జన్మనిచ్చింది తమిళనాడు అయినందున తన జీవితాన్ని రాష్ట్రానికి అంకితం చేస్తానని ఆమె చెప్పారు.

పలు రాజకీయ పార్టీల నుంచి తనకు ఆహ్వానం వచ్చిందని, అయితే ఎవరు పిలిచారన్నది ఇప్పుడు చెప్పనని ఆమె అన్నారు. ఇప్పుడు స్లిమ్‌గా తయారై మీ అందరికీ (మీడియా) ఎలా షాకిచ్చానో, వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అందరికీ షాకివ్వబోతున్నానని చెప్పారు.
బరువు తగ్గడం అసాధ్యమని ఎంత మంది చెప్పినా దాన్ని ఎలా సుసాధ్యం చేశానో, అలాగే రాజకీయాల్లోనూ అనుకున్నది సాధించి తీరుతానని ఆమె ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు. నమిత పలు తెలుగు సినిమాల్లో కూడా నటించారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications