ఇన్ఫోసిస్ లోకి నందన్ నీలేకని రీ ఎంట్రీ.. నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సెకండ్ ఇన్నింగ్స్
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, మాజీ ఎగ్జిక్యూటీవ్ చీఫ్ నందన్ నీలేకని ఇన్ఫోసిస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. నీలేకనిని నాన్ ఎగ్జిక్యూటీవ్ చైర్మన్‌గా నియమిస్తూ ఇన్ఫోసిస్ బోర్డు నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ: వ్యాపారవర్గాలు ఊహించిందే జరిగింది. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, మాజీ ఎగ్జిక్యూటివ్ చీఫ్ నందన్ నీలేకని ఇన్ఫోసిస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. నీలేకనిని నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమిస్తూ ఇన్ఫోసిస్ బోర్డు నిర్ణయం తీసుకుంది.
26 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు ఇన్ఫోసిస్‌ని స్థాపించిన వారిలో ఒకరైన నీలేకని 2009లో రెండవసారి అధికారంలోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వంతో కలిసి ఆధార్ ఆలోచనకి ప్రాణం పోశారు.

ఆధార్ వెనుకున్న ఈ మాస్టర్ మైండ్ అప్పటి నుంచి యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఏఐ) చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఇన్ఫీ సీఎండీ గా విశాల్ సిక్కా అనూహ్య రాజీనామాతో బోర్డులో తీవ్ర సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఇన్ఫోసిస్ సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో సంస్థని ఆ సంక్షోభం నుంచి బయటపడేసేందుకు నందన్ నీలేకని మరోసారి ఇన్ఫీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నారు.
మరోవైపు, ఇన్ఫోసిస్ బోర్డు నుంచి తప్పుకుంటున్నట్టుగా ఇన్ఫోసిస్ ఛైర్మన్ ఆర్.శేషసాయి, కో చైర్మన్ రవి వెంకటేశన్, జెఫ్ లేమాన్‌లు చేసిన రాజీనామాలను సంస్థ అంగీకరించింది. దీంతో శేషసాయి, రవి వెంకటేషన్, జెఫ్ లేమాన్ ఇన్ఫోసిస్ బోర్డు నుంచి వైదొలిగారు.












Click it and Unblock the Notifications