చెన్నై సీబీఐ కార్యాలయంలో దినకరన్ విచారణ: మరో వికెట్ ఐపీఎస్ అధికారి!

చెన్నైలోని సీబీఐ కార్యాలయంలో దినకరన్, అతని అనుచరుడు మల్లికార్జనను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు విచారిస్తున్నారు.

చెన్నై: అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా చక్రం తిప్పి అదే పార్టీ రెండాకుల చిహ్నం కోసం ఎన్నికల కమిషన్ కు లంచం ఎరవేశారని ఆరోపణలు రావడంతో ఢిల్లీలో అరెస్టు అయిన టీటీవీ దినకరన్, అతని అనుచరుడు మల్లికార్జునను విచారణ చెయ్యడానికి చెన్నై తీసుకు వచ్చారు.

గురువారం ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు దినకరన్, మల్లికార్జునను పిలుచుకుని కట్టుదిట్టమైన భద్రతో చెన్నై విమానాశ్రం చేరుకున్నారు. దినకరన్ ను చూడటానికి శశికళ వర్గంలోని అన్నాడీఎంకే పార్టీ అధికార ప్రతినిధి నంజిల్ సంపత్, పూహళేంది ఎయిర్ పోర్టు చేరుకున్నారు.

Nanjil Sampath and Pugazhenthi visited Chennai Airport to see Dinakaran today.

అయితే నంజిల్ సంపత్, పూహళేంది తదితరులు దినకరన్ తో మాట్లాడటానికి ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్ల లంచం ఎరవేశారని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు దినకరన్, మల్లికార్జునను అరెస్టు చేశారు.

మొదట ఈ కేసులో అరెస్టు అయిన బ్రోకర్ సుఖేష్ చంద్రశేఖర్ ను మాత్రం చెన్నై తీసుకురాలేదు. దినకరన్ ను చెన్నైలో విచారించాలని ఢిల్లీ పోలీసు అధికారులు నిర్ణయించారు. చెన్నైలోని సీబీఐ కార్యాలయంలో దినకరన్, మల్లికార్జనను విచారిస్తున్నారు. ఈ కేసులో దినకరన్ తో పాటు తమిళనాడుకు చెందిన ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిని విచారించడానికి ఢిల్లీ పోలీసులు సిద్దం అయ్యారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+