ప్రజల్ని మోసం చేశారు, మోడీని శిక్షించాల్సిందే: జెఠ్మలానీ
న్యూఢిల్లీ: ప్రజలను మోసం చేసిన ప్రధాని నరేంద్రమోడీని తప్పకుండా శిక్షిస్తారని ఒకప్పటి బీజేపీ నేత, వాజపేయి ప్రభుత్వ హయాంలో న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన రాం జెఠ్మలానీ ఆరోపించారు.
శనివారం ఆయన మాట్లాడుతూ
'మోడీ ప్రజలను మోసం చేశారు. బీహార్ ఎన్నికల్లో ఆయన తప్పకుండా ఓడిపోవాలి. నాకు బీహార్‌లో ఓటు ఉంటే కచ్చితంగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కే వేస్తాను ఎందుకంటే మోడీ ఓటమిపాలుకావాని కోరుకుంటున్నాను. అని ఆయన అన్నారు.

'బీజేపీ ఓటమికి బీహారే ప్రారంభస్థానం కావాలి. బీజేపీ నేతలు నన్ను ఫూల్ చేయోచ్చేమో కానీ బీహార్ ప్రజలను అలా చేయలేరు' అని ఆయన అన్నారు. బీజేపీ సభ్యుడైన రాం జెఠ్మలానీ ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీపై విమర్శలు చేసిన నేపథ్యంలో 2013లో ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే.
లోక్‌సభ ఎన్నికలకు ముందు నరేంద్రమోడీని ప్రమోట్ చేసినందుకు చాలా పశ్చాతాపడుతున్నానని పేర్కొన్నారు. భారత్‌కు మోక్షాన్ని ప్రసాదించడానికి ఆ దేవుడే తన ప్రతినిధిగా పంపంచాడని తాను చెప్పానని, అయితే అందులో ఎంత మాత్రం నిజం లేదని, మోడీ చేతిలో మోసపోయిన వారిలో తానొకడనని తెలిపారు.
విదేశాల్లో దాగిఉన్న నల్లధనాన్ని భారత్‌కు తీసుకురావడంలో యూపీఏ, మోడీ ప్రభుత్వం విఫలమయ్యాయని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications