నిన్న ధోనీ.. నేడు విష్ణువుగా మోడీ, వివాదాస్పదం
నాగపూర్: మహారాష్ట్రలోని నాగపూర్‌లో విష్ణుమూర్తి రూపంలో ప్రధాని నరేంద్ర మోడీ ఫ్లెక్సీ విమర్శలకు దారి తీస్తోంది. గణేష్ ఉత్సవాల సందర్భంగా స్థానిక బిజెపి నాయకులు, కార్యకర్తలు ప్రధాని మోడీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.
విష్ణుమూర్తి రూపంలో ఉన్న మోడీ ఫోటోలకు కొందరు అభిమానులు పూజలు కూడా నిర్వహించారు. అక్కడే భారీ గణపతి విగ్రహంతో పాటు విష్ణు రూపంలో ఉన్న మోడీ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం, దానికి పూజలు చేయడంపై దుమారం రేగుతోంది.

ప్రధాని మోడీ ఈ ఏడాదిన్నర కాలంలో ప్రవేశ పెట్టిన పథకాలను గుర్తు చేసేలా ఆ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆయన చుట్టూ ప్రభుత్వం పథకాలను పేర్కొన్నరు. ఇలా ఫ్లెక్సీని ఏర్పాటు చేయడాన్ని విపక్షాలు కూడా తప్పుపడుతున్నాయి.












Click it and Unblock the Notifications