త్వరలో కేంద్రమంత్రివర్గ పునర్వవ్యస్థీకరణ, జెడియూ, అన్నాడిఎంకెలకు చోటు?
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చోటుచేసుకొనే అవకాశం కన్పిస్తోంది. కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.దీంతో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలని ప్రధానమంత్రి మోడీ భావిస్తున్నారు.సెప్టెంబర్ 3వ, తేదిలోపుగా మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని సమాచారం.
కేంద్ర మంత్రివర్గాన్ని సెప్టెంబర్ 3వ, తేదిలోపుగా పునర్వవ్యస్థీకరించే అవకాశాలున్నాయని సమాచారం. మంత్రివర్గంలో మార్పులపై ప్రధానమంత్రి మోడీ ఆర్ఎస్ఎస్ పెద్దలతో చర్చించారు. అదే విధంగా పార్టీ చీఫ్ అమిత్‌షాతో కూడ మోడీ మంత్రివర్గం కూర్పుపై చర్చించారు.
చైనాలో జరిగే బ్రిక్స్ సమావేశానికి ప్రధానమంత్రి మోడీ హాజరుకానున్నారు. అయితే ఈ సమావేశానికి మోడీ హజరుకావడానికి ముందే కేంద్ర మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణ జరిగే అవకాశాలున్నాయని సమాచారం.

దేశంలో ఇటీవల కాలంలో మార్పులు చేర్పులు చోటుచేసుకొన్నాయి. బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మహకూటమి నుండి వైదొలిగారు. బిజెపితో జతకట్టారు. అన్నాడిఎంకె నేతలు కూడ బిజెపికి దగ్గరయ్యారు. ఈ రెండు పార్టీలకే కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి.ః
అదే విధంగా ఎన్‌సిపి కూడ ఎన్‌డిఏలో చేరే అవకాశం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై రెండు పార్టీల నుండి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. అయితే ఎన్‌సిపి కూడ ఎన్‌డిఏతో జతకట్టేందుకు సిద్దమని చెబితే ఆ పార్టీకి కూడ కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది.
అయితే ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గం నుండి ఆరు నుండి ఏడు మందికి ఉద్వాసన పలికే అవకాశం ఉంది. అయితే మిత్రపక్షాలతో పాటు నలుగురికి చోటు దక్కే అవకాశం ఉందని సమాచారం.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications