ఫేస్‌బుక్: టాప్‌లో ప్రధాని మోడీ, జాబితా ఇదే
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ఎంతో చురుకుగా ఉండే ప్రధాని నరేంద్ర మోడీ భారత ఫేస్‌బుక్ చార్ట్స్‌లో అగ్రస్థానాన్ని ఆక్రమించారు. ప్రపంచ స్థాయిలో అయితే ఆయన టాప్-10లో స్థానం దక్కించుకున్నారు. ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అగ్రస్థానంలో ఉన్నారు.
కాగా, భారతదేశంలో ఎక్కువగా ఫాలోఅవుతున్న ప్రముఖ వ్యక్తుల్లో బాలీవుడ్ యేతర ప్రముఖ వ్యక్తిగా మోడీ నిలవడం గమనార్హం. భారతదేశం నుంచి మరో ముగ్గురు ప్రముఖులే టాప్-10 జాబితాలో నిలిచారు. మాజీ రాష్ట్రపతి ఏపిజె అబ్దుల్ కలాం, బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, దీపికా పదుకొనేలు ఉన్నారు. కాగా, కలాం తర్వాతి స్థానాన్ని ‘బాహుబలి' చిత్రం సంపాదించడం గమనార్హం.
ఫేస్‌బుక్‌లో వెతుకుతున్న విషయాలు, స్థలాలపై ఫేస్‌బుక్ ఒక నివేదికను తాజాగా విడుదల చేసింది. 2015 సంవత్సరంలో యూజర్లు ఎక్కువగా సెర్చ్ చేసిన టాపిక్స్, స్థలాలను ఈ నివేదికలో తెలియజేసింది. ఇవే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫేస్‌బుక్ యూజర్లు సెర్చ్ చేసిన టాప్ టాపిక్స్, ప్రదేశాలు ఇతర వివరాలను కూడా ఫేస్‌బుక్ తన నివేదికలో పేర్కొంది.

2015లో భారత్‌లోని ఫేస్‌బుక్ యూజర్లు సెర్చ్ చేసిన టాప్ టాపిక్స్:
1. నరేంద్ర మోడీ
2. ఈ-కామర్స్ బూమ్
3. ఏపీజే అబ్దుల్ కలాం
4. బాహుబలి: ది బిగినింగ్
5. నేపాల్ భూకంపాలు
6. సల్మాన్‌ఖాన్
7. క్రికెట్ వరల్డ్‌కప్, ఇండియన్ ప్రీమియర్ లీగ్
8. బీహార్ ఎన్నికలు
9. దీపికా పదుకునే
10. ఇండియన్ ఆర్మీ
2015లో భారత్‌లోని ఫేస్‌బుక్ యూజర్లు సెర్చ్ చేసిన టాప్ ప్రదేశాలు:
1. ఇండియా గేట్
2. తాజ్‌మహల్
3. మెరీన్ డ్రైవ్, ముంబై
4. నంది హిల్స్
5. గేట్‌వే ఆఫ్ ఇండియా
6. హర్ కీ పౌరీ, హరిద్వార్
7. కుతుబ్‌మినార్
8. ముసోరి - ది క్వీన్ ఆఫ్ హిల్స్
9. రామోజీ ఫిలిం సిటీ
10. గోల్డెన్ టెంపుల్(అమృత్‌సర్)












Click it and Unblock the Notifications