ట్రాఫిక్ జాం, భద్రత: ప్రధాని కోసం రహస్య సొరంగం!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి తన కాన్వాయ్‌తో తరుచూ ప్రయాణాలు చేయాలంటే దేశ రాజధాని ఢిల్లీ మహా నగరంలో ట్రాఫిక్ జాంల వల్ల అటు ప్రధానికి, ఇటు ప్రజలకు చాలా కష్టంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నివాసం నుండి సఫ్దర్ జంగ్ విమానాశ్రయానికి ఏకంగా ఓ సొరంగ మార్గం నిర్మించారు.
నాలుగేళ్ల క్రితం మొదలైన ఈ ప్రాజెక్టు నిర్మాణం ఇప్పటికే దాదాపు పూర్తి కావొచ్చింది. ప్రధాని కార్యాలయం, పార్లమెంటు మినహాయించి వేరే ఎక్కడికి వెళ్లాలన్నా ఈ సొరంగ మార్గం ద్వారా ఆయన విమానాశ్రయానికి తేలిగ్గా చేరుకోవచ్చు.
అక్కడి నుండి హెలికాప్టర్‌లో ఎక్కడికైనా వెళ్లవచ్చును. ప్రధాని తరుచూ విమానాశ్రయానికి వెళ్లాల్సిన అవసరం వస్తుండటంతో ట్రాఫిక్ జాంల గొడవతో పాటు భద్రతా సమస్యని కూడా అధిగమించడానికి ఈ ఏర్పాటును చేశారు.

ఈ సొరంగ మార్గం.. కమల్ అతతుర్క్ మార్గ్, గోల్ఫ్ కోర్స్, సఫ్దర్ గంజ్ తంబ్ నుండి సప్ధర్ గంజ్ విమానాశ్రయంలోని హెలికాప్టర్ ఉండే చోటుకు వెళ్తుంది. ఈ సొరంగ మార్గం పనులను 2010లో ప్రారంభించారు.
కాగా, నరేంద్ర మోడీ 7 రేస్ కోర్స్ రోడ్డులోని బంగ్లా నెంబర్ 5లో ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. ఇది ప్రస్తుతం అతిథి గృహంగా ఉంది. అటల్ బిహారీ వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన నివాసంగా ఉపయోగించారు. దీనిని ఉపయోగించాలని మోడీ ఆసక్తి చూపిస్తున్నారట. నిన్నటి వరకు ప్రధానిగా ఉన్న మన్మోహన్ ఉపయోగించిన బంగ్లా నెంబర్ 3ను ఉపయోగించేందుకు మోడీ అనాసక్తిగా ఉన్నారట.












Click it and Unblock the Notifications