ప్రమాణ స్వీకారం: మొబైల్ ఫోన్‌లోనూ మోడీ ప్రసంగం!

న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార ప్రసంగాన్ని టెలివిజన్ ఛానళ్లలో చూడటమే కాదు, టీవీ అందుబాటులో లేని వారు ఫోన్‌లో కూడా వినవచ్చు. +91 022 4501 4501 నెంబరుకు డయల్ చేయడం ద్వారా మోడీ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వినొచ్చని ప్రముఖ మొబైల్ మార్కెటింగ్ కంపెనీ వీవాకనెక్ట్ తెలిపింది.

ప్రమాణ స్వీకార కార్యక్రమం అందరికీ అందుబాటులో ఉండేందుకు భారతీయ జనతా పార్టీతో కలిసి ఈ ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది. సాయంత్రం 6 గంటల నుంచి ఈ నంబరుకు డయల్ చేయవచ్చని తెలిపింది. కాగా, ప్రమాణ స్వీకారోత్సవం రాష్ట్రపతి భవన్ వెబ్‌సైట్ ద్వారా ప్రత్యక్షప్రసారం చేయబడుతుంది.

Narendra Modi's swearing-in to be available live on phone

ప్రమాణ స్వీకారం అనంతరం సోమవారం రాత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలోని 7 రేస్ కోర్స్ రోడ్‌లోని అధికార నివాసానికి మారిపోనున్నారు. ఆయన సోమవారం ఉదయం నుంచే ప్రధాని హోదాలో లభించే భద్రత కల్పిస్తున్నారు.

ప్రమాణ స్వీకారం తర్వాత దేశ విదేశాల ప్రముఖులతో కలిసి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచ్చే విందులో నరేంద్ర మోడీ పాల్గొంటారు. అనంతరం ఆయన అధికార నివాసానికి చేరుకుంటారు. ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాటు చేశారు. సార్క్ దేశాధినేతలతోపాటు పలు దేశాల ప్రతినిధులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతున్నారు. దేశంలోని రాజకీయ, సినీ ప్రముఖులు కూడా హాజరవుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+