PM Kisan: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ 17వ విడత విడుదల..

కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన అనంతరం పీఎం కిసాన్ నిధుల విడుదలకు సంబంధించి తొలి సంతకం చేశారు. దేశవ్యాప్తంగా అన్నదాతల ఖాతాల్లోతి రూ.20 వేల కోట్లు విడుదల చేశారు. ఈ నిధులను పీఎం కిసాన్ యోజన కింద 17వ విడతగా రైతుల ఖాతాల్లో జమ చేశారు.

దేశవ్యాప్తంగా 9 కోట్ల 30 వేల మంది రైతుల ఖాతాల్లో.. ఒక్కక్కొరికి 2 వేల రూపాయల చొప్పున వారి వారి బ్యాంకు ఖాతాల్లో పైసలు జమ కానున్నాయి. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని మోదీ అన్నారు. రైతుల కోసం, వ్యవసాయ రంగ కోసం మంతి కృషి చేస్తామన్నారు. ఆదివారం మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోదీ.. సోమవారం ప్రధాన మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.

Narendra Modi signed the first release of PM Kisan 17th tranche

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీ అనంతరం మంత్రిత్వ శాఖల కేటాయింపు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. పీఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ.6 వేల అందజేస్తోంది. నాలుగు నెలలకు రూ.2 వేల చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది.

ఇప్పటి వరకు 16 విడతలుగా మొత్తం రూ.32 వేలు అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఇ కేవైసీ చేసుకున్న వారికి పీఎం కిసాన్ యోజన కింద నిధులు విడుదల చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+