మోదీ ప్రమాణం.. వరుసగా మూడోసారి: 72 మందితో జంబో కేబినెట్
Modi's swearing-in ceremony: దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. దైవసాక్షిగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. దేశ ప్రధానిగా ఆయన ప్రమాణం చేయడం వరుసగా ఇది మూడోసారి.
ఈ కార్యక్రమానికి పలువురు ఆహ్వానితులు హాజరయ్యారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అధినేతలు పాల్గొన్నారు. వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఆ వెంటనే కేంద్రమంత్రుల ప్రమాణ స్వీకారం ఆరంభమైంది. మోదీ మంత్రివర్గంలో మొత్తం 72 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఇందులో 61 మంది బీజేపీ, 11 మంది ఎన్డీఏ అలయెన్స్ ఎంపీలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఇద్దరు ఎంపీలకు బెర్త్ లభించిన విషయం తెలిసిందే. ఓ బీజేపీ ఎంపీతో పాటు రాష్ట్రం నుంచి మొత్తం ముగ్గురికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించింది.












Click it and Unblock the Notifications