'మోడీతో ఏకీభవిస్తున్నా.. ఆయన గాడిద లాగే పనిచేస్తున్నారు..'

'గాడిదలా పనిచేస్తానని ప్రధాని మోడీ చెబుతున్నారు. అవును నిజమే.. ఆయన మాటలతో నేను ఏకీభవిస్తున్నాను.

న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారం అంటేనే ప్రత్యర్థులపై మాటల తూటాలు సంధించడం. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఆ ప్రచారమంతా ఇప్పుడు గాడిదల చుట్టూ తిరుగుతుంది. గుజరాత్ గాడిదలంటూ అఖిలేష్ చేసిన వ్యాఖ్యలను మోడీ ఇప్పటికే తిప్పికొట్టగా.. ఈ వివాదస్పద వ్యాఖ్యలకు కొనసాగింపుగా దిగ్విజయ్ కూడా గొంతు కలిపారు.

'గాడిదలా పనిచేస్తానని ప్రధాని మోడీ చెబుతున్నారు. అవును నిజమే.. ఆయన మాటలతో నేను ఏకీభవిస్తున్నాను. మోడీ నిజంగానే గాడిదలా పనిచేస్తున్నారు' అంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు.

Narendra Modi working exactly like a donkey says digwijay singh

కాగా, గుజరాత్ గాడిదలకు ప్రచారం చేయవద్దంటూ తొలుత అఖిలేష్ యాదవ్ పరోక్షంగా ప్రధాని మోడీని ఉద్దేశించి అమితాబ్ కు సూచన చేశారు. ఈ వ్యాఖ్యలను మోడీ తిప్పికొట్టారు. గాడిదలు విశ్వాసంతో పనిచేస్తాయని, రేయింబవళ్లూ అవి కష్టపడే తీరు గురించి మరచిపోవద్దని అన్నారు. గాడిదలను స్పూర్తిగా తీసుకుని పనిచేస్తానని తెలిపారు. మోడీ చేసిన ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా.. అవును నిజమే అంటూ దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+