భారత్ మొదటి ప్రధాని మోడీ!: గూగుల్ డైరెక్ట్ సెర్చ్‌లో

న్యూఢిల్లీ: భారత తొలి ప్రధానమంత్రి ఎవరు? అంటే ఎవరైనా వెంటనే తడుముకోకుండా జవహర్ లాల్ నెహ్రూ పేరు చెబుతారు. అయితే, ప్రముఖ సెర్చింజన్ వెబ్‌సైట్ గూగుల్‌లో మాత్రం ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో కనిపిస్తోంది.

తొలి ప్రధాని ఎవరు అని గూగుల్ సెర్చ్‌లో కొడితే.. జవహర్ లాల్ నెహ్రూ పేరు చూపిస్తోంది. పేరు నెహ్రూది చూపించినప్పటికీ... ఫోటో మాత్రం ప్రధాని మోడీది చూపిస్తోంది గూగుల్‌ సెర్చింజన్‌ సమాధానం.

Narendra Modis face on Indias first Prime Minister Google search

మనకి ఎలాంటి సమాచారం కావాలన్నా గూగుల్‌నే చూస్తుంటాం. అందుకే వినియోగదారులకు మరింత బాగా సేవలందించాలన్న ఆశయంతో గూగుల్‌ సంస్థ 2013లో గూగుల్‌ డైరెక్ట్‌ ఆన్సర్‌ ఫీచర్‌ ప్రవేశపెట్టింది.

అయితే అప్పటినుంచి ఈ ఫీచర్‌ తరచూ ఏదో ఒక పొరపాటుతో వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది. గూగుల్‌ డైరెక్ట్‌ ఆన్సర్‌ ఫీచర్‌లో తొలి ప్రధానిగా జవహర్‌లాల్‌ నెహ్రూ గురించి సమాచారం ఇచ్చి ఫొటో మాత్రం భారత ప్రస్తుత ప్రధాని మోడీ ఫొటో చూపించింది. గతంలో ఓసారి టాప్‌ 10 నేరస్తుల లిస్టులో మోడీ ఫొటో కన్పించింది. ఆ తర్వాత గూగుల్‌ యాజమాన్యం క్షమాపణ చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+