వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రదాడికి ఇస్లామిక్ స్టేట్ కుట్ర, యూఏఈలో స్కెచ్, తమిళనాడులో ఎన్ఐఏ దాడులు !

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో ఐదు ప్రాంతాల్లో జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఐఏ) అధికారులు దాడులు చేశారు. యూఏఈలో మకాం వేసిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు స్కెచ్ వేశారని తెలిసింది. ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో ఎన్ఐఏ అధికారలు దాడులు చేశారు.

కోయంబత్తూరు జిల్లాలో దాడులు చేసిన ఎన్ఐఏ అధికారులు ల్యాప్ టాప్ లు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, పెన్ డ్రైవ్ లు స్వాధీనం చేసుకున్నారు. ఎన్ఐఏ అధికారులు, తమిళనాడు పోలీసులు గురువారం వేకువ జామున ఐదు ప్రాంతాల్లో దాడులు చేశారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయని ఓ అధికారి తెలిపారు.

National Investigation Agency conducted raids at 5 locations in Coimbatore in Tamil Nadu.

బెంగళూరు టార్గెట్, దాడులకు స్కెచ్ వేసిన ఉగ్రవాది అరెస్టు, పైసా వసూల్, అగర్తలాలో !బెంగళూరు టార్గెట్, దాడులకు స్కెచ్ వేసిన ఉగ్రవాది అరెస్టు, పైసా వసూల్, అగర్తలాలో !

భారతదేశంలో దాడులు చెయ్యడానికి ఇస్లామిక్ స్టేట్ ( ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సానుభూతి పరులు ప్రయత్నిస్తున్నారని అధికారులకు సమాచారం అందింది. జులై నెలలో ఎన్ఐఏ అధికారులు వివిద ప్రాంతాల్లో దాడులు చేశారు. 14 మంది వ్యక్తులకు చెందిన నివాసాల మీద దాడులు చేశారు.

ఆ సమయంలో అనుమానిత నిందితులను అధికారులు విచారణ చేశారు. భారత్ లో దాడులు చేసి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. యూఏఇలో మకాం వేసిన 14 మంది నిందితులు భారత్ లో దాడులు చెయ్యడానికి కట్రలు పన్నారని వెలుగు చూడటంతో వారిని అరెస్టు చేసి భారత్ తీసుకువచ్చారు. ఆ 14 మంది వ్యక్తులకు చెందిన నివాసాల మీద గురువారం వేకువ జామున దాడులు చేశారని తెలిసింది. దాడులు ఇంకా కొనసాగుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
National Investigation Agency (INA) on Thursday conducted raids at 5 locations in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X