పోలీస్ అకాడమీకి తొలి మహిళా బాస్‌గా బహుగుణ?

1979 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కి చెందిన ఐపిఎస్ అధికారిని అరుణా బహుగుణ ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా ఉన్నసిఆర్‌పిఎఫ్ బలగాలకు స్పెషల్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. ఆమె 3 లక్షల మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లకు సేవలు అందిస్తున్నారు. ఇక్కడ కూడా నియామకమైన తొలి మహిళ ఆమే కావడం విశేషం.
సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న సుభాష్ గోస్వామి ఇటీవలే ఐటిబిపి డిజిగా వెళ్లడంతో ఆ పదవి ఖాళీ అయింది. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో పని చేసిన అనుభవం అరుణా బహుగుణకు ఉంది.
జాతీయ పోలీస్ అకాడమీకి బహుగుణ నియామకం అయితే ఆమె 28వ బాస్ కానున్నారు. ఎంతో మంది ఉన్నతాధికారులను తీర్చిదిద్దిన ఈ అకాడమీ కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది.












Click it and Unblock the Notifications