National Round up:నీట్ రద్దు నుంచి రాహుల్ పై మోదీ టార్గెట్ వరకు జాతీయ సమాహారం..!

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మరోవైపు ఆయా పార్టీలు తమ మేనిఫెస్టోలను విడుదల చేస్తున్నాయి. ఇలాంటి జాతీయ వార్తలను ఇప్పుడు చూద్దాం.

కేంద్ర మంత్రిపై ఈసీకి ఫిర్యాదు
కేంద్రమంత్రి శోభా కర్లాంజే పై డీఎంకే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మార్చి 1వ తేదీన బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన బాంబు దాడిలో తమిళనాడుకు చెందిన వ్యక్తి హస్తం ఉందని ఆరోపణలు చేశారు. దీనిపై డీఎంకే పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ శోభాపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రెండు రాష్ట్రాల మధ్య అల్లర్లు సృష్టించేలా ఆమె వ్యాఖ్యలున్నాయంటూ డీఎంకే ఫిర్యాదు చేసింది. అంతేకాదు తమిళ ప్రజలను శోభా కర్లాంజే అవమానించారని తన ఫిర్యాదులో పేర్కొంది డీఎంకే పార్టీ. ఇదిలా ఉంటే తమిళనాడు పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి శోభా. తాను చేసిన వ్యాఖ్యలతో ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాల్సిందిగా కోరారు.

National Round up in telugu Modi Targets Rahul while DMK release Manifesto

సీఏఏ అమలు లేదు, నీట్ పై నిషేధం
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో డీఎంకే మార్చి 20వ తేదీ బుధవారం రోజున మేనిఫెస్టో విడుదల చేసింది. ఈ సందర్భంగా బీజేపీ పై తీవ్ర విమర్శలు చేసింది. గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలను కమలం పార్టీ గాలికొదిలేసిందని డీఎంకే నిప్పులు చెరిగింది. మేనిఫెస్టోను విడుదల చేసిన సీఎం స్టాలిన్, ద్రవిడ పద్ధతిలో అమలు చేస్తున్న పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు. ఎన్నికలకు ముందు డీఎంకే ఏ హామీలైతే ఇచ్చిందో అన్నీ నెరవేరుస్తున్నామని గుర్తు చేసిన స్టాలిన్.. కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానంను తిరస్కరిస్తున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ నీట్(NEET)పరీక్షను కూడా రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పొందుపర్చారు. తమిళనాడులో CAAను అమలు చేయమని స్పష్టం చేశారు.

రాహుల్‌ను టార్గెట్ చేసిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 20 బుధవారం రోజున కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని తన ప్రసంగంలో రాహుల్ గురించి పరోక్షంగా ప్రస్తావించారు. పొలిటికల్ స్టార్టప్స్ ఒరిజినల్ స్టార్టప్స్ గురించి మాట్లాడుతూ... చాలామంది కొత్త పొలిటికల్ స్టార్టప్స్ ప్రారంభిస్తున్నారని అయితే ఒరిజినల్ స్టార్టప్స్‌తో కొత్త ఐడియాలు పుట్టుకొస్తాయని అన్నారు.

National Round up in telugu Modi Targets Rahul while DMK release Manifesto

అంతేకాదు రాజకీయాల్లో ఎన్ని స్టార్టప్‌లు ప్రారంభించినా మళ్లీ మళ్లీ వాటిని రీలాంచ్ చేయాల్సిందేనంటూ రాహుల్‌ను పరోక్షంగా టార్గెట్ చేశారు ప్రధాని మోదీ. ఒరిజినల్ స్టార్టప్స్ కొన్ని ప్రయోగాలు చేస్తూ సరికొత్త రీతిలో ఆలోచన చేసి కొత్త ఐడియాలతో బయటకొస్తాయని చెప్పిన మోదీ... పొలిటికల్ స్టార్టప్స్ అలా ఉండవని చెప్పారు. అంతేకాదు భారత్‌ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థికశక్తిగా ఎదుగుతోందని చెప్పారు. భారత అభివృద్ధిలో స్టార్టప్స్ ప్రధాన భూమికను పోషిస్తాయని మోదీ నొక్కి చెప్పారు. యువతను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పిన ప్రధాని మోదీ... నేటి యువత ఉద్యోగాలు పొందే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగిందని కొనియాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+