నేషనల్ తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్..!
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 30 ఏళ్ల జాతీయ స్థాయి తైక్వాండో క్రీడాకారిణిపై సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలు పోలీసులను ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ఆశ్రమంలో ఈ ఘటన చోటు చేసుకోగా నిందితుల్లో ఆశ్రమానికి చెందిన పూజారులు కూడా ఫిర్యాదులో పేర్కొనడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు.. గోవింద్‌నగర్ ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడు.. తనకు దుకాణం ఏర్పాటు చేయడంలో సహాయం చేస్తానని చెప్పాడని.. అందుకు స్థలం ఇప్పించేందుకు ఆశ్రమంలోని ప్రముఖులకు పరిచయం చేస్తానని చెప్పాడని పేర్కొంది. అంతే కాకుండా నాలుగు వేల రూపాయలు డిమాండ్ చేసి.. జనవరి 28న అతనితో కలిసి ఆశ్రమానికి వెళ్లినట్టు వివరించింది. అయితే ఆశ్రమానికి వెళ్లిన తర్వాత లడ్డూను తినమని ఇచ్చారని, అది తిన్న వెంటనే స్పృహ కోల్పోయినట్టు ఆమె చెప్పింది.

అనంతరం ఆ వృద్ధుడు, ఆశ్రమానికి చెందిన ప్రధాన పూజారి, మరో ఇద్దరు వ్యక్తులు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించారు. అంతే కాకుండా అంతటి దారుణాన్ని వీడియో తీయడమే కాకుండా.. ఆ వీడియోను బయటపెడతామని బెదిరించారని బాధితురాలు వెల్లడించారు. తీవ్రమైన మానసిక బాధకు గురైన ఇంత కాలం మౌనంగా ఉండిపోయినట్టు వాపోయింది.
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా గోవింద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపారు. బాధితురాలు సమర్పించిన వీడియో ఆధారంగా.. ఆశ్రమ గదిని పరిశీలించినట్టు ఏడీసీపీ సౌత్ మహేష్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని.. త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ ఆరోపణలపై ఆశ్రమ పూజారులు సైతం స్పందిస్తూ.. ఆ ఘటన జరిగిన సమయంలో తాము ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాలో ఉన్నామని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications