దగ్గరుండి యువతితో కొట్టించిన ఎమ్మెల్యే
థానె: ఆయన ఓ మాజీ మంత్రి, ప్రస్తుతం శాసన సభ్యుడు. తన కార్యాలయంలో దగ్గరుండి ఓ యువతితో యువకుడికి దేహశుద్ధి చేయించాడు. మాహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవహాద్ దగ్గరుండి యువకుడికి దేహశుద్ధి చేయించాడు.
ఈ వీడియో బయటకురావడంతో మహారాష్ట్రలో కలకలం రేగింది. జితేంద్ర అవహాద్ దగ్గరుండి యువకుడిని కొట్టించిన దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనపడుతున్నాయి. ప్రేమించమని వేధిస్తున్న యువకుడి మీద ఓ యువతి ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేసింది.

అంతే ఆయన ఆ యువకుడిని, యువతిని తన కార్యాలయానికి పిలిపించాడు. అందరి ముందు యువకుడిని యువతితో కొట్టించాడు. నేను ఏ తప్పు చెయ్యలేదని ఎమ్మెల్యే జితేంద్ర అవహాద్ అంటున్నారు.
ఈ విషయంపై మీడియా ఆయనను సంప్రధించింది. తాను తప్పు చేసినట్లు మీకు అనిపిస్తే వెంటనే ఉరి తియ్యండి అంటూ ఆవేశంతో ఊగిపోయారు. తనకు ఫిర్యాదు చేసిన యువతి మా ఇంటి సమీపంలోని మురికి వాడలో నివాసం ఉంటుందని ఆయన అన్నారు.
తనను ప్రేమించమని నిత్యం యువకుడు వేధించడంతో విసిగిపోయిన ఆమె తనకు ఫిర్యాదు చేసిందని చెప్పారు. పోలీసులు యువకుడి మీద కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకు ఎమ్మెల్యే జితేంద్ర మీద ఎవ్వరూ ఫిర్యాదు చెయ్యలేదని పోలీసు అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications