కొబ్బరిచిప్ప ఖరీదు అంతనా, నిజమా?: ఐపీఎస్ అధికారిణి ట్వీట్, ధర తెలిస్తే షాకవుతారు
న్యూఢిల్లీ: సాధారణంగా కొబ్బరికాయ ధర రూ.15, రూ.20 మహా అయితే రూ.30 ఉంటుదేమో. కొబ్బరికాయ కొట్టాక వచ్చే కొబ్బరి చిప్పలను దాదాపు అందరూ పడవేస్తారు. ఎవరికైనా అవసరం ఉన్నా చిప్పల ఖరీదు చాలా తక్కువగా ఉంటుంది. కానీ అలాంటి ఓ కొబ్బరి చిప్ప ధరను చెబితే నోరు వెళ్లబెడతారు. ఆ కొబ్బరి చిప్ప ఖరీదు అక్షరాలా రూ.1365.
ఇంకా చెప్పాలంటే దాని అసలు ధర రూ.3000. యాభై ఐదు శాతం (55 శాతం) ఆఫర్ మీద అది దాదాపు రూ.1400కే వస్తోంది. ఈ సహజ కొబ్బరి చిప్పను ఓ ఐపీఎస్ అధికారిణి అమెజాన్‌లో చూశారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ఆమె తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

ఈ కొబ్బరిచిప్ప సైజు కూడా ఒకటిన్నర అంగుళాల ఎత్తు, నాలుగున్నర అంగుళాల వెడల్పు ఉంది. ఇందులో ఓ వంద మిల్లీ లీటర్ల నీళ్లు పడతాయి. ఇటీవలి కాలంలో కొబ్బరి చిప్పలతో చేసిన బౌల్స్ వాడడం ట్రెండ్‌గా మారింది. కొబ్బరి చిప్పలను పాలిష్ చేసి, అందమైన రంగులోకి మలుస్తున్న చిప్పలు చాలామందిని ఆకర్షిస్తున్నాయి.
ఇవి ఒక్కొక్కటీ రూ.100లోపే ఉంటున్నాయి. మరి సాధారణ కొబ్బరి చిప్పను ఏకంగా రూ.1,365కు అమ్మడం మాత్రం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దానిని చూసిన ఐపీఎస్ అధికారి రెమా రాజేశ్వరి.. సీరియస్‍లీ అంటూ ఆశ్చర్యపోతూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పైనా నెటిజన్లు బాగా స్పందిస్తున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications