Cleanest City: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరం ఏదో తెలుసా..?

దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నేవీ ముంబై నిలిచింది. కేంద్రం ప్రభుత్వం తాజాగా వెల్లడించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2026 జాబితాలో మహారాష్ట్రలోని నేవీ ముంబై మోస్ట్ క్లీనెస్ట్ సిటీగా టాప్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్ లోని సూరత్ ఉంది. ఇక మూడో స్థానంలో ఏపీలోని విజయవాడ ఉండటం విశేషం. అలాగే 3 నుంచి 10 లక్షల వరకు జనాభా ఉన్న నగరాల్లో మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని టాప్ ప్లేస్ లోకి వచ్చింది. ఆ తర్వాత రెండో స్థానంలో చంఢీగఢ్ ఇక మూడో స్థానంలో గుంటూరు నిలిచింది. అయితే గత ఎనిమిది సంవత్సరాలుగా ఇండోర్ నగరం దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా కొనసాగుతూ వస్తోంది. కానీ ఈ ఏడాది ఇండోర్ నగరం లిస్టులో చోటు సాధించలేకపోయింది.

స్వచ్ఛ్ సర్వేక్షణ్ 2026 లో భాగంగా పలు కేటగిరీల్లో విజయం సాధించినవారికి భారత రాష్ర్టపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేశారు. ఇక నది ఒడ్డున ఉన్న పరిశుభ్రమైన నగరాల జాబితాలో మధ్యప్రదేశ్ లోని రేవా తొలి స్థానంలో నిలిచింది. అలాగే రెండో స్థానంలో బిలాస్ పూర్ ఉంది. ఇక మూడో స్థానంలో వారణాసి ఉంది. అలాగే 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల కేటగిరీల్లో గ్రేటర్ విశాఖపట్నం అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో జబల్ పూర్, లక్నో ఉన్నాయి. ఇక కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. స్వచ్చ్ కోస్టల్ టౌన్ కేటగిరీలో ఒడిషాలోని పూరీ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ జాబితాలో రెండో స్థానంలో కేరళలోని అలప్పూజ అలాగే మూడో స్థానంలో మహారాష్ట్రలోని రత్నగిరి ఉన్నాయి.

NaviMumbai the cleanest city in the country revealed by Central Government Swachh Survekshan 2026

అలాగే పరిశుభ్రమైన హిమాలయ నగరంలో రుద్రాపూర్ టాప్ ప్లేస్ లో ఉంది. అలాగే జమ్మూ కాశ్మీర్ లో రెండో స్థానంలో ఉంది. వీటితోపాటు మెంటార్ సిటీ కేటగిరీలో గుజరాత్ లోని అహ్మదాబాద్ తొలి స్థానంలో ఉంది. ఇక రెండో స్థానంలో ఇండోర్ ఉంది. మరోవైపు మూడో స్థానంలో ఏపీలోని తిరుపతి నిలవడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+