ఐఎన్ఎస్ సంధాయక్‌లో అధికారిపై జూనియర్ల దాడి: హెలికాప్టర్‌తో వెంబడించిన నేవీ
భారత నేవీకి చెందిన సర్వే షిప్ ఐఎన్‌ఎస్ సంధాయక్‌పై నలుగురు నావికులు.. ఓ నేవీ అధికారికి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సంధాయక్ ఒడిశా తీరంలో ఉండగా నలుగురు నావికులు..
న్యూఢిల్లీ: భారత నేవీకి చెందిన సర్వే షిప్ ఐఎన్‌ఎస్ సంధాయక్‌పై నలుగురు నావికులు.. ఓ నేవీ అధికారికి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సంధాయక్ ఒడిశా తీరంలో ఉండగా నలుగురు నావికులు.. ఓ సీనియర్ నేవీ అధికారిపై దాడి చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... సంధాయక్‌లోని నేవీ అధికారి ఆదేశాలను నావికులు సరిగ్గా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు.
ఆ నలుగురు నావికులను సదరు అధికారి సర్వే మోటార్ పడవలను తీయమన్నారు. అలాగే నలుగురు నావికులను అటెన్షన్‌లో నిలబడమని చెప్పగా.. ఒకరు నిర్లక్ష్యంగా సరిగ్గా నిలబడలేదు. దీంతో ఆ అధికారి అతడిని సరిగ్గా నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఆగ్రహించిన నావికుడు అధికారిపై చేయి చేసుకున్నట్లు సమాచారం.

ఆ సమయంలో మిగతా నావికులు కూడా అతడితో కలిసి అధికారిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి పరిస్థితి అదుపు చేసే ప్రయత్నం చేశారు. హెలికాప్టర్‌ను పిలిపించి నలుగురు నావికులను నావపై నుంచి పంపించేశారు. ఆ నలుగురు క్రమశిక్షణా చర్యలు ఎదుర్కోనున్నారు. ఈ ఘటనపై ఓ దర్యాప్తు బృందం ఇప్పటికే విచారణ ప్రారంభించింది.
ఇలాంటి చర్యలను నేవీ సహించబోదని, తాము క్రమశిక్షణ విషయంలో ఉన్నత స్థాయి ప్రమాణాలను పాటిస్తామని నేవీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ ఘటన అనంతరం ఐఎన్‌ఎస్ సంధాయక్ తిరిగి కార్యకలాపాలు ప్రారంభించింది. సంధాయక్ సముద్ర ఉపరితలంపై, సముద్ర గర్భంలోనూ సర్వే నిర్వహించి సమాచారం సేకరిస్తుంది. కాగా, సంధాయక్ 2001లో నేవీలో చేరింది.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications