మావోయిస్ట్ అగ్రనేత గణపతిని చుట్టుముట్టిన పోలీసులు?

అంబుజ్‌మండ్ అటవీ ప్రాంతంలో గణపతిని పోలీసులు దిగ్బంధం చేశారని, ఏ విధంగానూ తప్పించుకోవడానికి వీల్లేని విధంగా అన్ని ప్రాంతాలనూ కమ్మేసినట్టుగా తెలుస్తోంది. ఇటీవలి కాలంలో పెద్ద సంఖ్యలో నక్సల్స్ లొంగిపోతున్న నేపథ్యంలో తదుపరి వ్యూహం గురించి చర్చించేందుకు మావోయిస్టులు ఈ ప్రాంతంలో సమాచారం ఏర్పాటు చేశారని, దానికి గణపతి హాజరవుతున్నారని ఇంటెలిజెన్స్ సమాచారం అందుకున్న పోలీసులు పెద్దఎత్తున మోహరించినట్టుగా తెలుస్తోంది.
గత తొమ్మిది నెలల కాలంలో చత్తీస్‌గఢ్‌లో 200మందికి పైగా నక్సల్స్ లొంగిపోవడం వల్ల ఆయువు పట్టుగా ఉన్న ప్రాంతంలోనే మావోయిస్టుల ఉనికికే విఘాతం కలిగే పరిస్థితి ఏర్పడింది. ఈ అటవీ ప్రాంతంలో తలదాచుకుంటున్న మావోయిస్టు అగ్ర నేతల్ని పట్టుకునేందుకు రాష్ట్ర పోలీసులు, సిఆర్‌పిఎఫ్ దళాలు పనె్నండు బృందాలుగా ఏర్పడి సంయుక్తంగా గాలింపు చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది.
తమ ఆచూకీకి ఎంతమాత్రం పసిగట్టలేనంతగా జార్ఖండ్, ఒడిషా, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతాల్లో నక్సల్ అగ్రనేతలు ఎప్పటికప్పుడు మకాం మారుస్తూ భద్రతా దళాలకు విస్మయానే్న కలిగిస్తున్నారు. ఈ నేపధ్యంలో గణపతిని దాదాపుగా పోలీసులు చుట్టుముట్టేశారన్న కథనాలు వెలువడటం గమనార్హం. సిపిఐ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శిగా ఉన్న 65 ఏళ్ల గణపతి కోసం గత కొనే్నళ్లుగా విస్తృత గాలింపు జరుగుతోంది. ఆయనను పట్టించిన వారికి 3 కోట్ల రూపాయల బహుమతి ఇస్తామన్న ప్రకటన కూడా వెలువడింది.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications