నయనతార, విఘ్నేష్ శివన్ సరోగసీపై తీర్పు
నయనతార, విఘ్నేష్ శివన్ దంపతుల సరోగసీ చట్టబద్ధమే అని తమిళనాడు ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన విచారణ కమిటీ ప్రకటించింది. నయన్ దంపతులు 2021 ఆగస్టులో సరోగసీ ప్రక్రియ ప్రారంభించగా, అదే ఏడాది నవంబరులో ఒప్పందం కుదిరిందని కమిటీ వెల్లడించింది. ఈ మేరకు కమిటీ తమిళనాడు ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. నయన్, విఘ్నేష్ 2016 మార్చి 11న తమ వివాహం రిజిస్టర్ అయినట్లుగా అఫిడవిట్ దాఖలు చేశారు. నిబంధనలన్నీ సరిగానే ఉన్నాయని తెలిపారు. అయితే నిబంధనలన్నింటినీ ఈ దంపతులు అనుసరించినప్పటికీ సరోగసీని ఎందుకు ఎంచుకున్నారనే విషయంలో స్పష్టత లేదు.
ఏడు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న నయనతార- విఘ్నేష్ శివన్ ఈ ఏడాది జూన్‌లో వివాహం చేసుకున్నారు. తమకు కవల పిల్లలు పుట్టారని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా అక్టోబర్ 9న ఆనందం వ్యక్తం చేశారు. వివాహమైన నాలుగు నెలల్లోనే పిల్లలు ఎలా సాధ్యమైదంటూ దక్షిణ భారతదేశంలో చర్చనీయాంశంగా మారింది. భారతదేశంలో సరోగసీ విధానంపై నిషేధం ఉన్నప్పటికీ వీరిద్దరూ ఎలా పిల్లల్ని కన్నారంటూ పలువురు ప్రశ్నించడంతో తమిళనాడు ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.

నయనతార దక్షిణ భారతదేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న కథానాయికగా నిలుస్తోంది. అభిమానులు ముద్దుగా లేడీ సూపర్ స్టార్ అని పిలుచుకుంటారు. తాజాగా చిరంజీవికి సోదరిగా నటించిన గాడ్ ఫాదర్ విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో నయనతార నటన బాగుందని, హుందా అయిన పాత్రలో మరోసారి జీవించారంటూ సినీ విమర్శకుల నుంచి కూడా ప్రశంసలందుకున్నారు.












Click it and Unblock the Notifications