ఎకె 47తో ఫేస్‌బుక్‌లో ఎన్సీ నేత కుమారుడి ఫొటో
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ అధికార నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత నసీర్ అస్లాం వాని కుమారుడు ఫేస్‌బుక్‌లో ఎకె 47 గన్‌తో దర్శనమిచ్చాడు. పోలీసు అధికారులతో పాటు ఎకె47 పట్టుకుని దిగిన ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేసినట్లు మీడియాలో సోమవారం వార్తలు వచ్చాయి. ఈ ఫొటో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
నసీర్ అస్లామ్ మాత్రం తన కుమారుడిని వెనకేసుకొచ్చారు. ఈ విషయంపై నసీర్‌ను ప్రశ్నిస్తే, ఫొటో గురించి తనకు ఏమీ తెలియదని, తన కుమారుడి ఫేస్‌బుక్ పేజీని పరిశీలిస్తానని చెప్పారు. తన కుమారుడు పోలీసు అధికారి కావాలని కోరుకుంటున్నాడని చెబుతూ అది తప్పా అని ప్రశ్నించారు.

శ్రీనగర్‌లోని తమ నివాసం ఎదుట నసీర్ అస్లాం వాని కుమారుడు నిలుచుని ఎకె 47 పట్టుకున్న ఫొటో ఫేస్‌బుక్‌లో దర్శనమిచ్చింది. అయితే, అది నిజమైన చిత్రం కాదని, దాన్ని మార్పులు చేర్పులు చేశారని నసీర్ ఆ తర్వాత చెప్పారు. నసీర్ అస్లాం వాని కుమారుడు ఎవరినీ బెదిరించలేదని, కేవలం అలా పట్టుకున్నాడని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు అంటున్నారు.
అయితే, ఆ ఫొటోపై బిజెపి తీవ్రంగా స్పందించింది. అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పు పట్టింది. ఆ అబ్బాయికి తుపాకి పట్టుకోవడానికి అవకాశం ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. వాని కుమారుడి ఉదంతం చాలా తీవ్రమైందని బిజెపి నాకుడు సునీల్ సేథీ వ్యాఖ్యానించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications