షారూక్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ - డ్రగ్స్ పెడ్లర్స్ తో ఛాటింగ్ : డ్రగ్స్ స్వాధీనం..!!

ఉదయం నుంచి సంచలనంగా మారిన క్రూజ్ షిప్‌ రేవ్ పార్టీ లో ప్రముఖుల పిల్లలను ఎన్సీబీ అదుపులోకి తీసుకుంది. అందులో బాలీవుడ్ న‌టుడు షారుక్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్‌ తో సహా ఎనిమిది మందిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసింది. పక్కా సమాచారంతో ఎన్సీబీ అధికారులు ముంబై తీరంలో క్రూజ్ షిప్‌లో జ‌రిగిన రేవ్ పార్టీ పైన దాడి చేసారు. ఇందులో ఆర్య‌న్‌తోపాటు ప‌లువురు వ్యాపార ప్ర‌ముఖుల పిల్ల‌లు కూడా ఉన్న‌ట్లు తెలిసింది. క్రూజ్ షిప్‌పై దాడి చేసిన స‌మ‌యంలో ఆర్య‌న్ ఖాన్ అందులోనే ఉన్నాడు.

అయితే తాను ఓ గెస్ట్‌గా మాత్ర‌మే అక్క‌డికి వెళ్లిన‌ట్లు విచార‌ణ‌లో ఆర్య‌న్ చెప్పిన‌ట్లు స‌మాచారం. నిజానికి ఈ రేవ్ పార్టీకి సంబంధించి 15 రోజుల ముందే ఎన్సీబీకి స‌మాచారం ఉన్నా.. అందులో సెల‌బ్రిటీల పిల్ల‌లు ఉంటార‌ని మాత్రం వాళ్ల‌కు తెలియ‌లేదు. ఉద‌యం నుంచీ ఆర్య‌న్‌ను ప్ర‌శ్నించిన ఎన్సీబీ.. సాయంత్రం అరెస్ట్ చేసింది. అత‌నితోపాటు స్నేహితుడు అర్బాజ్ మ‌ర్చంట్‌, మున్మున్ ధ‌మేచా, నుపుర్ సారికా, ఇస్మీత్ సింగ్‌, మోహ‌క్ జ‌స్వాల్‌, విక్రాంత్ చోక‌ర్‌, గోమిత్ చోప్రాల‌ను కూడా అరెస్ట్ చేసిన‌ట్లు ఎన్సీబీ తెలిపింది.

NCB has arrested Bollywood superstar Shah Rukh Khan’s son Aryan Khan, and two others in the Mumbai cruise drug bust case

క్రూజ్ షిప్‌లో నిషేధిత డ్ర‌గ్స్ ల‌భించిన‌ట్లు ఎన్సీబీ వెల్ల‌డించింది. అరెస్ట్ చేసిన త‌ర్వాత ఆర్య‌న్‌తోపాటు అత‌ని స్నేహితుడు అర్బాజ్‌, మున్మున్ ధ‌మేచాల‌ను ఆరోగ్య ప‌రీక్ష‌ల కోసం తీసుకెళ్లారు. మొత్తం అయిదు ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది. అర్యన్ పట్టుబడిన సమయంలో డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్యన్ ఖాన్ ఫోన్ లో పలు సంచలన విషయాలను ఎన్సీబీ అధికారులు గుర్తించినట్లుగా సమాచారం.

దీంతో..సెల్ ఫోన్ ను అధికారులు సీజ్ చేసారు. ఆర్యన్ తన ఫోన్ ద్వారా డ్రగ్స్ పెడ్లర్స్ తో ఛాటింగ్ చేసినట్లు తేల్చారు. దీంతో..వారితో ఉన్న సంబంధాలు..పేమెంట్స్ ..ఇతరుల పాత్ర గురించి ఉదయం నుంచి ఆరా తీసినట్లుగా సమాచారం. ఇప్పుడు ప్రముఖుల పిల్లలు ఉండటం..వారు పట్టబడ్డారనే సమాచారం సెన్సేషన్ గా మారింది. ఇప్పుడు ఎన్సీబీ అధికారులు విచారణ తరువాత వెల్లడించే వివరాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+