లగ్జరీ షిప్‌లో హైప్రొఫైల్ రేవ్ పార్టీ: మస్త్ మజా: బాలీవుడ్ సూపర్ స్టార్ కుమారుడి సహా..

ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బాలీవుడ్ డ్రగ్స్ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఇప్పటికే కొందరు సెలెబ్రిటీలు అరెస్ట్ అయ్యారు. పలువురు టాప్ హీరోలు, హీరోయిన్లను నార్కొటిక్స్ బ్యూరో అధికారులు విచారణకు పిలిపించారు. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఉదంతంతో వెలుగులోకి వచ్చిన ఈ డ్రగ్స్ కేసుపై విచారణ కొనసాగుతుండగానే.. మళ్లీ అలాంటి ఘటనే చోటు చేసుకుంది. హై ప్రొఫైల్ రేవ్ పార్టీని ఎన్సీబీ అధికారులు భగ్నం చేశారు.

లగ్జరీ షిప్‌లో రేవ్ పార్టీ..

లగ్జరీ షిప్‌లో రేవ్ పార్టీ..

ముంబై సముద్ర తీర ప్రాంతంలో ఓ లగ్జరీ షిప్‌లో ఏర్పాటు చేసిన రేవ్ పార్టీని నార్కొటిక్స్ బ్యూరో అధికారులు భగ్నం చేశారు. హైప్రొఫైల్ రేవ్ పార్టీ ఇది. ఓ విలాసవంతమైన షిప్‌లో దీన్ని ఆర్గనైజ్ చేశారంటే.. ఎన్ని కోట్ల రూపాయలను దీని మీద ఖర్చు చేసి ఉంటారనేది అర్థం చేసుకోవచ్చు. నిషేధిత డ్రగ్స్ అన్నీ భారీ స్థాయిలో లభించాయి ఈ షిప్‌లో. రేవ్ పార్టీలో పాల్గొన్న వారిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. లక్షల రూపాయల్లో నగదు మొత్తాన్ని సీజ్ చేశారు.

గోవా టు ముంబై..

అత్యంత విలాసవంతమైన కార్డీలియా క్రూయిజ్ లైనర్స్ ఎంప్రెస్ షిప్ ఇది. శనివారం రాత్రి ముంబై నుంచి గోవాకు బయలుదేరింది. రెండువారాల కిందట ముంబై-గోవా మధ్య ఈ క్రూయిజ్ లైనర్ సర్వీసులు ప్రారంభం అయ్యాయి. రేవ్ పార్టీని నిర్వహించడానికే ఈ క్రూయిజ్ లైనర్స్‌ను నిర్వాహకులు అద్దెకు తీసుకున్నారు. ముంబైలో ఆరంభమైన రేవ్ పార్టీ నడి సముద్రంలో పీక్స్‌కు చేరుకుంది. ఇందులో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో నార్కొటిక్స్ బ్యూరో అధికారులు మెరుపుదాడికి దిగారు. ఇందులో పాల్గొన్న వారిని అరెస్ట్ చేశారు.

బాలీవుడ్ సూపర్ స్టార్ కుమారుడు కూడా..

బాలీవుడ్ సూపర్ స్టార్ కుమారుడు కూడా..

రేవ్ పార్టీలో పాల్గొన్న ఎనిమిది మందిని నార్కొటిక్స్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. వారిలో బాలీవుడ్ సూపర్ స్టార్ కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కొకైన్, హషీష్, ఎండీఎంఏను భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. నగదును సీజ్ చేశారు. ఈ మెరుపుదాడికి ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే స్వయంగా సారథ్యం వహించారు. సమాచారం అందుకున్న వెంటనే ఎన్సీబీ అధికారులు ప్రత్యేక బోట్లల్లో షిప్‌కు చేరుకుని, రేవ్ పార్టీని భగ్నం చేశారు. ఏడు గంటల పాటు ఈ మిషన్ కొనసాగింది.

ఎన్డీపీఎస్ యాక్ట్ కింద

రేవ్ పార్టీ నిర్వాహకులు, అందులో పాల్గొన్న వారందరూ నార్కొటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ కింద అరెస్ట్ అయ్యారు. వారిని ఇవ్వాళ న్యాయస్థానం ముందు హాజరు పర్చనున్నారు. రిమాండ్‌లోకి తీసుకున్న తరువాత వారిని సెక్షన్ 67 కింద విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్టయిన సమాచారం తెలుసుకున్న వెంటనే టాప్ క్రిమినల్ లాయర్ ఆనందిని ఫెర్నాండెజ్ ఎన్సీబీ కార్యాలయానికి చేరుకున్నారని, ఇద్దరిని విడిపించుకుని తన వెంట తీసుకెళ్లినట్లు సమాచారం.

మ్యూజికల్ నైట్ కోసం..

మ్యూజికల్ నైట్ కోసం..

నిజానికి- ఓ మ్యూజికల్ నైట్‌ను నిర్వహించడానికి ఈ క్రూయిజ్ లైనర్‌ను అద్దెకు తీసుకున్నట్లు చెబుతున్నారు. శని, ఆది, సోమ వారాల్లో మ్యూజికల్ వోయెజ్ పేరుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, వందలాది టికెట్లు సేల్ అయ్యాయని తెలుస్తోంది. ఈ మ్యూజికల్ వోయెజ్ ప్రోగ్రామ్ కోసం విక్రయించిన టికెట్ల ధర లక్ష రూపాయల వరకు ఉందని అంటున్నారు. కొందరు సెలెబ్రిటీలకు మాత్రమే ఈ టికెట్లను విక్రయించారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+