మంత్రి నవాబ్ మాలిక్ అరెస్ట్ దుమారం : మమతాకు శరద్ పవార్ ఫోన్.. సలహా ఇచ్చిన దీదీ !!
మనీలాండరింగ్ కేసులో అరెస్టైన మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ వ్యవహారం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలను సృష్టిస్తుంది. ఈ కేసు వ్యవహారంపై ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై మహా వికాస్ అగాఢీ సంకీర్ణ ప్రభుత్వం తర్జన భర్జన పడుతుంది. ఎన్సీపీ పార్టీ సీనియర్ నేత, ఉద్ధవ్ థాకరే మంత్రి వర్గ సహచరుడుగా ఉన్న మాలిక్ కు ఈడీ అరెస్ట్ చేయడంతో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాలిక్ వ్యవహారంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు.

శరద్ పవార్‌కు మమతా సలహా
మహారాష్ట్రలో రాజకీయ దుమారం నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ ఫోన్ చేశారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మనీలాండరింగ్ వ్యవహారాలకు సంబంధించిన కేసులో అరెస్ట్ అయిన మంత్రి నవాబ్ మాలిక్ వ్యవహారంపై వీరిద్దరూ చర్చించుకున్నారు. ఈ దాదాపు 10 నిమిషాలకు పైగా ఈ విషయంపై మాట్లాడుకున్నారు. ఈ కేసు విషయంలో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై దీదీ సలహా తీసుకున్నారు. నవాబ్ మాలిక్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించాల్సిన అవసరం లేదని మమతా స్పష్టం చేసినట్లు ఎన్సీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఎన్సీపీకి దీదీ మద్దతు
మాలిక్ అరెస్ట్‌ను సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో ఎన్సీపీకి పూర్తి మద్దతుగా ఉంటామని శరద్ పవార్‌కు దీదీ హామీ ఇచ్చారు. ప్రతిపక్షాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌లను కేంద్రం ప్రయోగిస్తుందని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీరును ఎండగట్టారు. విపక్షాలను నిర్విర్యం చేసేందుకు రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు . కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ దుర్మార్గాలను ఎదుర్కోవడానికి ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని ఈ సందర్బంగా పేర్కొన్నారు.

మాలిక్‌ను 14 రోజుల కస్టడీకి ఇవ్వాలన్న ఈడీ
దావూద్ ఇబ్రహీం మనీలాండరింగ్ కేసులో మంత్రి నవాబ్ మాలిక్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అంతకు ముందు అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద ఆయన వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు తీసుకున్నారు. దాదాపు ఆరు గంటల పాటు విచారించారు . ఈ కేసు విషయంలో మరింత లోతుగా విచారించేందుకు మాలిక్‌ను14 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఈడీ కోరింది. దావూద్ ఇబ్రహీం, అతని అనుచరుల కోసం పలు చోట్ల వివాదాస్పద ఆస్తులు మాలిక్ కొనుగోలు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఆరెస్ట్ చేశారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications