నాగిని నృత్యంతో నిరసన తెలిపారిలా(వీడియో)
ముంబై: ప్రజలు తమ సమస్యలను పరిష్కరించమని పాలకులకు, అధికారులకు ప్రజలు వినతి పత్రాలు ఇవ్వడం, విన్నపాలు పెట్టుకోవడం సర్వ సాధారణమే విషయమే. అప్పటికీ పరిష్కారం లభించకపోతే ధర్నాలు, ఆందోళనతో తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తారు.
అయితే, మహారాష్ట్రలోని బుల్దనా జిల్లా వాసులు మాత్రం తమదైన శైలిలో నిరసన తెలిపారు. ప్రజా పనుల శాఖ తమ ప్రాంతంపై చూపుతున్న వివక్షను నిరసిస్తూ పీడబ్ల్యూడీ కార్యాలయంలో స్థానికులు పూలదండాలతో వెళ్లారు. ఆ తర్వాత నాగిని నృత్యం చేస్తూ అధికారులు చుట్టూ తిరిగారు.
వారి విచిత్ర నిరసనతో అధికారులు అవాక్కయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగాఈ నాగిని డ్యాన్స్ వీడియో మీడియాకు ఎక్కడంతో బుల్దనా వాసుల సమస్యలు పాలకుల దృష్టికి వెళ్లాయి.
ఛత్రపతి శివాజీ మార్కెట్ సమీపంలోని రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయని స్థానికులు తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో విసుగెత్తిపోయి నాగిని నృత్యంతో నిరసనకు దిగినట్టు వెల్లడించారు. నిరసన తెలిపిన వారిలో పలువురు ఎన్సీపీ కార్యకర్తలు కూడా ఉన్నారు.












Click it and Unblock the Notifications