పోర్న్ కంటెంట్ తో బిగ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్: ఈ యాప్‌లు తక్షణమే డిజేబుల్ చేయండి- కేంద్రం

దేశంలో మొబైల్ యూజర్లకు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. సోషల్ మీడియా వేదికల ద్వారా చలామణి అవుతున్న కొన్ని ప్రమాదకర, మోసపూరిత ఆండ్రాయిడ్ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆ జాబితాను కూడా విడుదల చేసింది. ప్రత్యేకించి.. అశ్లీల కంటెంట్ ఆశ చూపిస్తూ మొబైల్ ఫోన్లలోకి చొరబడి, యూజర్ల వ్యక్తిగత సమాచారంతో పాటు బ్యాంకింగ్ వివరాలను తస్కరించే ఓ నూతన తరహా ఆర్థిక మోసాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని తేల్చింది.

కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ ఈ వ్యవహారంలో కీలక నివేదికను విడుదల చేసింది. సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల ద్వారా ఆకర్షణీయమైన ప్రకటనలను రన్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రకటనలపై క్లిక్ చేయగానే యూజర్లు సులభంగా కొన్ని నిర్దిష్ట అశ్లీల వెబ్‌సైట్లకు రీడైరెక్ట్ అవుతారు. అక్కడ సదరు అడల్ట్ కంటెంట్‌ను చూడ్డానికి వీలుగా థర్డ్ పార్టీ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకునేలా ప్రలోభపెడుతున్నారు.

NCTAU and MHA says Fake Porn Applications Named Night Play Reloop and More Are Targeting Users

నైట్ ప్లే (Night Play), రిలూప్ (Reloop), కిస్ (Kyss), విమో (Vimo), రివో (Rivo), నెక్సో (Nexo), విక్సా (Vixa) వంటి పేర్లతో ఆయా మొబైల్ అప్లికేషన్లు సర్కులేట్ అవుతున్నాయి. ఈ యాప్‌లు అశ్లీల కంటెంట్ చూపించే వేదికలు కావని, వీటి వెనుక ప్రమాదకరమైన వైరస్, మాల్వేర్ కోడ్‌లు ఉన్నట్లు హోం శాఖ తెలిపింది. యూజర్లను బురిడీ కొట్టించి వారి ఫోన్లలో వీటిని ఇన్‌స్టాల్ చేయించడమే ఈ ముఠాల ప్రధాన లక్ష్యం.

కాక్రోచ్ జనత పార్టీకి సుప్రీంకోర్టు నుంచి బిగ్ రిలీఫ్.. సీజేఐ బెంచ్ స్వయంగా..!!
కాక్రోచ్ జనత పార్టీకి సుప్రీంకోర్టు నుంచి బిగ్ రిలీఫ్.. సీజేఐ బెంచ్ స్వయంగా..!!

ఒకసారి ఈ యాప్‌లు మొబైల్‌లో ఇన్‌స్టాల్ అయిన తర్వాత, అవి పని చేయాలంటే అనుమతులు ఇవ్వాలని యూజర్లను కోరుతాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో ఉండే యాక్సెసిబిలిటీ పర్మిషన్ వీటికి లభిస్తే చాలు, యూజర్ ప్రమేయం లేకుండానే హ్యాకర్లు సదరు స్క్రీన్, కీబోర్డ్ ఎంట్రీలను సులభంగా గుర్తిస్తారు. దీంతో ఫోన్ సదరు యూజర్ కు తెలియకుండానే వారి బ్యాంక్ ఖాతాల నుంచి ఓటీపీలను సేకరించి భారీ స్థాయిలో నిధులు కాజేయడానికి వీలు కలుగుతుంది.

సీఎం విజయ్ స్పీడ్ కు కళ్లెం: అలా చేయకపోతే టీవీకే పొత్తు నుంచి వైదొలగుతాం
సీఎం విజయ్ స్పీడ్ కు కళ్లెం: అలా చేయకపోతే టీవీకే పొత్తు నుంచి వైదొలగుతాం

ఈ మాల్వేర్ యాప్‌లు డేటా చోరీకి మాత్రమే పరిమితం కాకుండా, మొబైల్‌లో ఓ ఇండిపెండెంట్ వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ కనెక్షన్‌ను కూడా హోస్ట్ చేస్తున్నట్లు హోం శాఖ నివేదిక స్పష్టం చేసింది. ఈ వీపీఎన్ సాయంతో బాధితుడి ఇంటర్నెట్ నెట్‌వర్క్ ఆధారంగా ఇతర చట్ట వ్యతిరేక సైబర్ నేరాలకు సంబంధించిన ట్రాఫిక్‌ను క్రైమ్ నెట్‌వర్క్ డైరెక్ట్ చేస్తుంది. దీనివల్ల నేరం జరిగినప్పుడు బాధితుడే నిందితుడిగా మారే ప్రమాదం ఉంటుంది.

పాకిస్తాన్ తో సంబంధాలు తెంచుకున్న స్టార్ క్రికెటర్: ఐపీఎల్ కు లైన్ క్లియర్?
పాకిస్తాన్ తో సంబంధాలు తెంచుకున్న స్టార్ క్రికెటర్: ఐపీఎల్ కు లైన్ క్లియర్?

సాధారణంగా ఇలాంటి మాల్వేర్ల ఉనికిని గుర్తించిన యూజర్ వాటిని ఫోన్ సెట్టింగ్స్ ద్వారా అన్‌ఇన్‌స్టాల్ చేయడానికి ప్రయత్నిస్తే, అవి అన్‌ఇన్‌స్టాల్ కాకుండా సెట్టింగ్స్‌ను బ్లాక్ చేయగలవు. హ్యాకర్లు మొబైల్ డివైస్ అడ్మిన్ హక్కులను చేజిక్కించుకోవడం వల్ల యూజర్లు సాధారణ పద్ధతుల్లో వీటిని తొలగించలేరు. గూగుల్ ప్లే స్టోర్ కు సంబంధం లేని ఎలాంటి ఏపీకే ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకోకూడదని, సోషల్ మీడియాలో వచ్చే ఉచిత యాప్స్ ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోం శాఖ హెచ్చరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+