అమెరికా సర్వే లెక్కలు: బిజెపికి 171, కాంగ్రెస్‌కు 52

వివిధ వర్గాలకు చెందిన దాదాపు రెండు లక్షల మంది భారతీయులను అమెరికా నియమించిన సర్వే వర్గాలు ప్రశ్నించాయి. బిజెపికి ఈ ఎన్నికల్లో కనీసం 171 సీట్లు వస్తాయని, నరేంద్ర మోడీ సారథ్యంలో బలమైన ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడుతుందని అమెరికన్ సర్వే తేల్చింది. అమెరికా సర్వే జరిపిన తర్వాత ఎన్డీటీవీ జరిపిన సర్వేలో బిజెపికి 195 సీట్లు వస్తాయని తేలింది.
అయితే భారత ఇంటలిజెన్స్ బ్యూరో వర్గాలు మాత్రం బిజెపి డబుల్ సెంచరీ సాధిస్తుందని ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. అమెరికా సర్వే గురించి తెలిసిన తర్వాతే కేంద్రమంత్రి చిదంబరం, మనీష్ తివారీతో సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఎన్నికల్లో పోటీకి విముఖత చూపించారని కానీ, కాంగ్రెస్ అధిష్ఠానం వారు పోటీ చేయాల్సిందేనని స్పష్టం చేస్తోందని అంటున్నారు.
మరోవైపు, ఇటీవలి వరకూ మన్మోహన్ సర్కార్‌కు అనుకూలంగా వ్యవహరించిన అమెరికా ప్రభుత్వం తాజాగా మోడీకి అనుకూలంగా వైఖరి మార్చుకునేందుకు మానసికంగా సిద్ధమవుతోంది. గుజరాత్ అల్లర్ల సాకుతో మోదీకి 2005లో వీసా నిరాకరించిన అమెరికా, ఇప్పుడు ఆయనకు ఎర్ర తివాచీ పరిచేందుకు సిద్ధమవుతోంది.












Click it and Unblock the Notifications