కేసీఆర్ సూచన మేరకే రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక: మోడీ ఫోన్
తెలంగాణ సీఎం కేసీఆర్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు రాష్ట్రపతి అభ్యర్థిగా బీహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్‌ను ఎంపిక చేసినట్లు ప్రధాని తెలిపారు.
హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు రాష్ట్రపతి అభ్యర్థిగా బీహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్‌ను ఎంపిక చేసినట్లు ప్రధాని తెలిపారు.
ప్రధాని మోడీ సీఎం కేసీఆర్ తో ఫోన్లో మాట్లాడుతూ.. 'ఒక దళిత నాయకుడిని రాష్ర్టపతిగా ఎంపిక చేయాలని మీరు సూచించారు. మీ సూచన మేరకు దళిత నేతనే రాష్ర్టపతి అభ్యర్థిగా ఎంపిక చేశాం, అందుకే మీకు ముందుగా ఫోన్ చేస్తున్నాను, మీ పూర్తి మద్దతు కోరుతున్నాను..' అన్నారు.

ప్రధానితో సంభాషణ అనంతరం సీఎం కేసీఆర్ వెంటనే పార్టీ నేతలను సంప్రదించారు. ఒక దళిత నేతకు అవకాశం వచ్చినందుకు, ప్రధాని విజ్ఞప్తి మేరకు, ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.
ఈ మేరకు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు తెలిపారు. ఎన్డీఏ రాష్ర్టపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్‌కు సీఎం కేసీఆర్ మద్దతు తెలిపినట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తమిళనాడు సీఎం పళనిస్వామి, బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు కూడా ఫోన్ చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ గోవింద్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications