బీజేపీ మేజిక్ తో మారుతున్ననెంబర్ గేమ్, మిత్రపక్షాలు అలర్ట్..!!
బీజేపీ కొత్త పొలిటికల్ ఆపరేషన్ మొదలు పెట్టింది. టీఎంసీలో తిరుగుబాటుతో ఒక్క సారిగా లెక్క లు మారిపోతున్నాయి. టీఎంసీ ఎంపీల మద్దతు విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి.. భవిష్యత్ సమీకరణాలకు సిద్దం అవుతోంది. ఇండియా కూటమి బలం తగ్గటం.. ఎన్డీఏ బలం రెండు సభల్లోనూ పెరగటంతో కీలక బిల్లుల ఆమోదానికి లైన్ క్లియర్ చేసుకుంటోంది. ఈ సమయం లోనే జరుగుతున్న పరిణామాలు.. బీజేపీ వ్యూహాలతో మిత్రపక్షాలు అలర్ట్ అవుతున్నాయి.
పార్లమెంట్ వేదికగా ఒక్క సారిగా బలా బలాలు మారిపోతున్నాయి. బీజేపీ నాయకత్వం పక్కా వ్యూహాత్మకంగా ప్రణాళికలు అమలు చేస్తోంది. విపక్షాలతో పాటుగా మిత్రపక్షాలు బీజేపీ కొత్త లెక్కల తో అలర్ట్ అవుతున్నాయి. పార్లమెంట్ లో సంఖ్యా పరంగా టీఎంసీ బలంగా ఉంది. ఇప్పుడు ఆ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఎన్డీఏ బలాన్ని పెంచేసాయి. దీంతో.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న తిరుగుబాటు పాలక పక్షం ఎన్డీయేకి కలిసి వచ్చింది. పార్లమెంటులో ఎన్డీయే సీట్లు పెరిగి ఉభయ సభల్లోనూ మూడింట రెండు వంతుల మెజారిటీకి దగ్గరైంది. దీంతో కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను కూడా సులువుగా ఆమోదించుకొనే అవకాశం ఉంది. లోక్‌సభలో మాత్రం 2/3 మెజారిటీకి 363 సీట్లు అవసరం కాగా టీఎంసీ ఎంపీలు 20 మంది మద్దతు ఇచ్చినా ఎన్డీయే బలం 313 సీట్లకే చేరుతుంది.

కీలక బిల్లుల ఆమోదానికి లైన్ క్లియర్ చేసేలా
ఇక రాజ్యసభలో ఎన్డీయేకి 148 మంది ఎంపీల బలం ఉండగా... ప్రస్తుతం ఎన్నికలు జరుగుతోన్న జార్ఖండ్, మిజోరాంలలో మూడు సీట్లు దక్కే అవకాశం ఉంది. అలాగే బెంగాల్‌లో ముగ్గురు టీఎంసీ ఎంపీలు రాజీనామా చేయనుండడంతో ఉప ఎన్నికల్లో ఆ సీట్లనూ దక్కించుకోనుంది. దీంతో రాజ్యసభలో ఎన్డీయే బలం 154 సీట్లకు చేరుతుంది. అయితే 2/3 మెజారిటీకి ఇంకా 9 సీట్లు తగ్గుతాయి. టీఎంసీ ఎంపీల్లో పలువురు రాజీనామా చేసే పరిస్థితి ఉండడంతో ఎన్డీయే రాజ్యసభలో 2/3 మెజారిటీకి చేరుకుంటుందని పరిశీలకుల అంచనా. మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్‌లో 10 మంది ఎంపీల పదవీ కాలం రానున్న నవంబరుతో పూర్తికానుండడంతో రాజ్యసభలో పాలకపక్షం బలం తగ్గే పరిస్థితీ ఉంది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న సీట్ల ప్రకారం వాటిలో కొన్ని సీట్లు సమాజ్‌వాదీ పార్టీకి దక్కే అవకాశం ఉండడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఇక, మహిళా బిల్లుతో పాటుగా డీలిమిటేషన్ బిల్లు సైతం అవరోధాలు లేకుండా ఆమోదించుకునే విధంగా బీజేపీ నాయకత్వం కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది.












Click it and Unblock the Notifications