రవీష్ కుమార్‌కు రామన్ మెగసెసే అవార్డు

ఢిల్లీ: ప్రముఖ జర్నలిస్టు, ఎన్డీటీవీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రావీష్ కుమార్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక రామన్ మెగసెసే అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. 2019 సంవత్సరానికిగానూ ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు రామన్ మెగసెసే ఫౌండేషన్ ప్రకటించింది. జర్నలిజం రంగంలో ఆయన చేసిన సేవలకు గానూ ఈ అవార్డును అందిస్తున్నట్లు వెల్లడించింది.

రామన్ మెగసెసే ఫౌండేషన్ ఏటా ఐదుగురిని విజేతలుగా ప్రకటిస్తుండగా.. ఈ ఏడాది రవీష్ కుమార్‌తో పాటు మయన్మార్‌కు చెందిన కో స్వీ విన్, థాయ్‌లాండ్‌కు చెందిన అంగ్టానా నీల పైజిత్, ఫిలిప్పీన్స్‌కు చెందిన రేముండో పూజజంటే కయాబ్యాబ్, దక్షిణ కొరియాకు చెందిన కిమ్ జోంగ్ ఉన్నారు.
ఆసియా నోబెల్ బహుమతిగా భావించే రామన్ మెగసెసే అవార్డును ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో సెప్టెంబర్ 9న ప్రదానం చేయనున్నారు.

NDTVs Ravish Kumar Wins 2019 Ramon Magsaysay Award

ఈ ఏడాది భారత్ నుంచి పురస్కారానికి ఎంపికైన రవీష్ కుమార్‌కు పలువురు అభినందనలు తెలియజేశారు. రామన్ మెగసెసే ఫౌండేషన్ ఏటా ఆయా రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వ్యక్తులకు అవార్డుతో సత్కరిస్తోంది. ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసే జ్ఞాపకార్థం దీనిని 1957లో ఏర్పాటు చేశారు. సామాజిక సేవ, జర్నలిజం, సాహిత్యం, సృజనాత్మకత, ప్రపంచశాంతి, అత్యుత్తమ నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తులను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+