ప్రమాణ స్వీకారం: మోడీతోపాటు సగం కేబినెట్!

న్యూఢిల్లీ: భారత 15వ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ సోమవారం సాయంత్రం 6గంటలకు ప్రమాణం చేయనున్నారు. ఆయనతోపాటు సగం మందికిపైగా కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే 35 మంది కేబినెట్ మంత్రులు జాబితాను నరేంద్ర మోడీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపినట్లు తెలిసింది. వీరిలో 17 మంది కేబినెట్ మంత్రులుగా, 18 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌కు హోంశాఖ,
బిజెపి సీనియర్ నేత అరుణ్ జైట్లీకి ఆర్థిక శాఖ, సుష్మా స్వరాజ్‌కు విదేశీ వ్యవహారాల శాఖ ఇవ్వనున్నట్లు తెలిసింది. రవిశంకర్ ప్రసాద్‌కు సమాచార శాఖ, నితిన్ గడ్కరీకి రోడ్లు, రైల్వే శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా అరుణ్ శౌరికి అవకాశం ఉంది.

 Nearly half of Narendra Modi's team to be sworn in today

మరికొందరు సీనియర్ నేతలు మేనకా గాంధీ, అనంత కుమార్, ఉమా భారతి, వికె సింగ్‌లకు కూడా మోడీ కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బండారు దత్తాత్రేయ, వెంకయ్యనాడు, నిర్మలా సీతారామన్, బిజెపి కూటమిలోని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు అశోక్ గజపతిరాజు, మహారాష్ట్రకు చెందిన శివసేన ఎంపి అనంత సీతేలకు కూడా కేంద్రమంత్రి వర్గంలో చోటు లభించే అవకాశం ఉంది. ఇండోర్ ఎంపి సుమిత్రా మహాజన్ స్పీకర్‌గా వ్యవహరించే అవకాశం ఉంది.

కాబోయే మంత్రులకు రాష్ట్రపతి భవన్ ఈ మేరకు సమాచారం పంపుతున్నట్లు తెలిసింది. సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి కూటమికి 336 స్థానాలు, బిజెపికి సొంతంగా 282 స్థానాలు వచ్చిన విషయం తెలిసిందే. బిజెపికి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ వచ్చినప్పటికీ ఎన్డీఏ(బిజెపి కూటమి) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికే బిజెపి అధినాయకత్వం మొగ్గుచూపుతోంది.

కాగా, 75 ఏళ్లు నిండిని వారికి మోడీ కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం లేనట్లుగానే కనిపిస్తోంది. బిజెపి అగ్రనేతలు ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహర్ జోషీలకు కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం లేనట్లుగానే తెలుస్తోంది. అయితే వీరికి ప్రత్యేక హోదాగల పదవులు ఏమైనా కట్టబెట్టే అవకాశం ఉంది. కాగా, మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు ఢిల్లీకి చేరుకుంటున్నారు. శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్ష, మాల్దీవుల అధ్యక్షుడు రాంగులాల్ ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. పాకిస్థాన్ అధ్యక్షుడు నవాజ్ ఫరీఫ్ కూడా హాజరుకానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+