సరికొత్త ఆర్టీ-పీసీఆర్ టెస్ట్-పుక్కిలించి ఉమ్మేస్తే చాలు-మూడు గంటల్లో రిజల్ట్
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో దీన్ని ఎదుర్కొనేందుకు జాతీయ పరిశోదనా సంస్దలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం వాడుతున్న కరోనా పరీక్షల విధానాలతో పాటు వ్యాక్సిన్లపైనా పరిశోధనలు చేస్తున్నాయి. ఇదే క్రమంలో జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్ పరిశోధనా సంస్ధ నీరీ శాస్త్రవేత్తలు సెలైన్ ఆధారిత కొత్త రకం ఆర్టీ-పీసీఆర్ పరీక్షా విధానాన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న మరే ఇతర పరీక్షలతో పోల్చినా ఇది మెరుగైన ఫలితం ఇస్తుందంటున్నారు.
Recommended Video

నీరీ శాస్త్రవేత్తల ప్రయోగం
జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్ పరిశోధనా సంస్ధ నీరీ శాస్త్రవేత్తలు ప్రస్తుతం కరోనా రోగులకు వాడుతున్న పరీక్షల కంటే మెరుగైన సెలైన్ ఆధారిత కొత్త రకం ఆర్టీ-పీసీఆర్ పరీక్షా విధానాన్ని అభివృద్ధి చేశారు. ఇందులో మిగతా టెస్టుల కంటే రోగులు అత్యంత సులువుగా శాంపిల్స్ ఇచ్చేందుకు, టెస్టులు చేసి ఫలితం వెల్లడించేందుకు సైతం అవకాశం ఉంటుందని వారు చెప్తున్నారు. డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా అనుమతి కోసం వారు ఎదురుచూస్తున్నారు.

సరికొత్త కరోనా పరీక్ష
కరోనా పరీక్షల కోసం ప్రస్తుతం వాడుతున్న విధానాల్లో అత్యంత విశ్వసనీయమైనది ఆర్టీ-పీసీఆర్ టెస్ట్. ఇందులో భాగంగా రోగి ముక్కు, గొంతు నుంచి శాంపిల్స్ సేకరించి వాటిని పరీక్షిస్తారు. అందులో వైరస్ ఉన్నట్లు నిర్దారణ అయితే పాజిటివ్‌గా ప్రకటిస్తున్నారు. అయితే ఇలా శాంపిల్స్‌ను సేకరించి వాటిపై పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించడం ఆలస్యమవుతోంది. దీన్ని నివారించేందుకు వీలుగా నీరీ శాస్త్రవేత్తలు సరికొత్త కరోనా పరీక్షను అభివృద్ది చేశారు. ఈ పరీక్షలో అత్యంత సులువుగా రోగి నుంచి శాంపిల్ సేకరించవచ్చు.

సెలైన్ ఆర్టీ-పీసీఆర్ టెస్ట్
ఈ కొత్త రకం సెలైన్ ఆర్టీ-పీసీఆర్ టెస్ట్‌లో ఓ గొట్టంలో సెలైన్ ద్రావకాన్ని తీసుకుని దాన్ని రోగి నోటిలోకి తీసుకుని పుక్కిలించి ఉమ్మేస్తారు. దాన్ని యథాతథంగా ల్యాబ్‌కు పంపిస్తారు. అక్కడ నిర్ణీత ఉష్ణోగ్రతలో నీరీ సంస్ధ తయారు చేసిన మరో బఫర్ సొల్యూషన్‌లో దాన్ని ఉంచి వేడి చేస్తారు. దీంతో ఆర్టీ-పీసీఆర్ టెస్ట్‌కు కావాల్సిన ఫలితం వచ్చేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ మూడు గంటల్లోనే పూర్తయి ఫలితం వచ్చేస్తుందని నీరీ శాస్తవేత్తలు చెప్తున్నారు..

తాజా పరీక్షతో ప్రయోజనాలివే
ప్రస్తుతం కరోనా రోగుల నుంచి శాంపిల్స్ సేకరణకు వాడుతున్న స్వాబ్ టెస్టులతో పోలిస్తే ఇది అత్యంత సులువైన పరీక్ష అని నీరీ చెబుతోంది. అంతే కాదు స్వాబ్ టెస్టుల్లో అందరు రోగుల నుంచి శాంపిల్స్ సేకరణ అంత సులువు కాదు. కానీ ఈ పరీక్షలో మాత్రం చాలా సులువుగా రోగి నోటి ద్వారా ద్రావకాన్ని తాగించి పుక్కిలించి ఉమ్మేయడమే కాబట్టి అత్యంత సులువుగా శాంపిల్ సేకరణ పూర్తవుతుందని శాస్తవేత్తలు చెప్తున్నారు. ఇందులో రోగులే తమ శాంపిల్‌ను సేకరించి ఇచ్చేందుకు కూడా వీలుందని పేర్కొంటున్నారు.
ఇప్పటికే ఐసీఎంఆర్ అనుమతి పొందిన ఈ విధానానికి డ్రగ్ కంట్రోలర్ అనుమతి లభించాల్సి ఉంది. మారుమూల ప్రాంతాల్లో ల్యాబ్ సౌకర్యాలు లేని చోట సైతం కరోనా రోగులకు ఈ టెస్టు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్తున్నారు.
-
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
యుద్ధం వేళ.. భారత్ కు అదానీ బిగ్ బూస్ట్.. 2 వేల మెషిన్ గన్ లు డెలివరీ.. -
3 ప్రభుత్వ బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఊరుకునేదే లేదంటూ !! -
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !!












Click it and Unblock the Notifications