Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

NEET-2020 Exam:నీట్ దరఖాస్తు గడువును పొడిగించిన నిర్వాహకులు..కొత్త తేదీ ఇదే..!

న్యూఢిల్లీ: నీట్ పరీక్ష రిజిస్ట్రేషన్ చివరితేదీని పొడిగిస్తూ హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ముందుగా విడుదలైన షెడ్యూల్ ప్రకారం నీట్-2020 పరీక్షకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ డిసెంబర్ 31, 2019 రాత్రి 11:50 గంటలుగా ఉన్నింది. అయితే మానవవనరుల మంత్రిత్వ శాఖకు దరఖాస్తు గడువును పొడిగించాల్సిందిగా అభ్యర్థనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో జనవరి 6వ తేదీ రాత్రి 11:50 నిమిషాల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని హెచ్‌ఆర్‌డీ శాఖ తెలిపింది.

వెబ్‌సైట్ పై ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో కొందరు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారని హెచ్‌ఆర్‌డీ పేర్కొంది. అయితే ఇతర అంశాలకు సంబంధించిన తేదీల్లో ఎలాంటి మార్పు ఉండబోదని హెచ్‌ఆర్‌డీ తెలిపింది. అంటే జనవరి 15 నుంచి జనవరి 31 వరకు ఉన్న పలు ప్రక్రియలకు సంబంధించిన తేదీల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. మరోవైపు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎంపిక చేసిన కొన్ని నోడల్ సెంటర్లలో జమ్మూకశ్మీర్, లేహ్ కార్గిల్‌లో నివాసముంటున్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులను సబ్మిట్ చేయొచ్చని తెలిపింది.

NEET-2020 : Last date for submission of Applications extended to January 6, 2020

నేషనల్ మెడికల్ కమిషన్ చట్టం 2019లోని సెక్షన్ 14 ద్వారా మెడిసిన్ చదవాలనే అభ్యర్థులకు అందరికి ఉమ్మడి పరీక్ష నీట్ నిర్వహించడం జరుగుతుంది. ఇది అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ పొందేందుకు ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతోంది. ఎయిమ్స్, జిప్‌మర్, లాంటి ప్రతిష్టాత్మక మెడికల్ కాలేజీలకు కూడా అడ్మిషన్ నీట్ ద్వారానే జరుగుతుందని అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యతేదీలు:

* నీట్ పరీక్ష : మే 3, 2020

* క్రెడిట్ కార్డు /డెబిట్ కార్డు /నెట్ బ్యాంకింగ్/యూపీఐ ద్వారా ఫీజు చెల్లింపు: డిసెంబర్ 2, 2019 నుంచి జనవరి 6, 2020.

* NTA వెబ్‌సైట్‌పై అప్లికేషన్‌లో ఏమైనా పొరపాట్లను సరిదిద్దుకునేందుకు : జనవరి 15-31, 2020

* అడ్మిట్ కార్డు లేదా హాల్‌ టికెట్స్ : మార్చి 27, 2020

* NTA వెబ్‌సైట్‌పై ఫలితాలు ప్రకటన: జూన్ 4, 2020

అప్లికేషన్ ఫీజు:

జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.1500 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఆర్థికంగా వెనక బడిన జనరల్ కేటగిరీ అభ్యర్థులు (EWS) మరియు ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అభ్యర్థులు రూ.1400 చెల్లించాల్సి ఉంటుంది. ట్రాన్స్ జెండర్ అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ.800 చెల్లించాల్సి ఉంటుంది. ఇక పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ పై ఉన్న ఇన్ఫర్మేషన్ బ్రోచర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని చూడగలరు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+