2026 NEET UG Results: NEET 2026 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..!
NEET 2026 రీఎగ్జామ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) గురువారం రాత్రి విడుదల చేసింది. ఈ పరీక్షలో 19 మంది విద్యార్థులు 720 మార్కులకు గాను 700 మార్కులు సాధించారు. అలాగే 1,492 మంది విద్యార్థులు 650 కు పైగా మార్కులు సాధించారు. ఈ రీ ఎగ్జామ్ లో పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆర్యన్ గుప్తా, హరియాణా రాష్ట్రానికి చెందిన ప్రన్షుల్ భన్సాల్ 715 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు.
ఇక గతనెల 21న దేశవ్యాప్తంగా NEET 2026 రీఎగ్జామ్ ను దాదాపు 20 లక్షల మంది రాయగా 11.21 లక్షల మంది క్వాలిఫై అయ్యారని NTA తెలిపింది. 720 మార్కులకు గాను 138 మందికి 690 కు పైగా మార్కులు వచ్చాయని పేర్కొంది. అలాగే 10,160 మందికి 600 మార్కులు.. 90,780 మందికి 500 పైగా మార్కులు వచ్చాయని తెలిపింది. కాగా మే 3న నీట్ పరీక్ష జరగ్గా.. అది లీక్ కావడంతో జూన్ 21 న రీ ఎగ్జామ్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి..?
2026 నీట్ యూజీ రీ ఎగ్జామ్ రిజల్ట్స్ ను ఎలా చేసుకోవాలంటే..? ముందుగా విద్యార్థులు neet.nta.nic.in అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించాలి. వ్యక్తిగత డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత NEET UG 2026 answer key పైన క్లిక్ చేయాలి. ఈ లింక్ హోమ్ పేజీపైనే ఉంటుంది. ఈ లింక్ ను క్లిక్ చేయగానే కొత్తగా విండో ఓపెన్ అవుతుంది. అందులో ఫైనల్ ఆన్సర్ కీ ఉంటుంది. దానిని డౌన్ లోడ్ చేసుకోవాలి.













Click it and Unblock the Notifications