అభిమానిని అంటూ.. సల్మాన్ ఖాన్‌కు జైలు శిక్షపై నీతూ అగర్వాల్
కర్నూలు: ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు జైలు శిక్ష విధించిన అంశంపై టాలీవుడ్ నటి నీతు అగర్వాల్ గురువారం స్పందించారు. సల్మాన్ ఖాన్‌కు జైలు శిక్ష పడటం బాధాకరమన్నారు. తాను సల్మాన్ అభిమానినని చెప్పారు.
కాగా, నీతు అగర్వాల్ ప్రేమ ప్రయాణం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎర్ర చందనం స్మగ్లర్ మస్తాన్ వలీ ఆ చిత్రాన్ని నిర్మించారు. అనంతరం ఇరువురు కలిసి జీవించారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే ఎర్రచందనం కేసులో నీతూ అగర్వాల్ అరెస్టై బెయిల్ పైన బయటకు వచ్చారు.

సల్మాన్ ఖాన్‌కు జైలు శిక్ష పడటం పైన పలువురు ప్రముఖులు స్పందించిన విషయం తెలిసిందే. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. తెలుగు సినీ నటుడు, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కూడా రెండు రోజుల క్రితం స్పందించారు.
గురువారం నాడు బాంద్రాలోని సల్మాన్ ఖాన్ నివాసానికి మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధినేత రాజ్ థాకరే సహా పలువురు వచ్చి పరామర్శించారు. వీరిలో అమీర్ ఖాన్, కరణ్ జోహార్, ప్రీతిజింతా, సోనాక్షి సిన్హా, రాణీముఖర్జీ, రవీనా టండాన్ తదితరులు ఉన్నారు.












Click it and Unblock the Notifications