భూకంపం: గూగుల్ ఎగ్జిక్యూటివ్ మృతి, ఆచూకీ కనుగొనే గూగుల్ టూల్
న్యూఢిల్లీ/ఖాట్మాండ్: నేపాల్లో భూకంపం నేపథ్యంలో ఈ ఘటనలో సెర్చింజన్ గూగుల్‌కు చెందిన ఓ ఎగ్జిక్యూటివ్ మృతి చెందాడు. మృతి చెందిన ఎగ్జిక్యూటివ్ పేరు డ్యాన్ ఫ్రెండిన్‌బర్గ్. ఈ విషయాన్ని డ్యాన్ ఫ్రెండిన్‌బర్గ్ సోదరి, ఇన్‌స్టాగ్రాంలో తన సోదరుడి ఫోటోను పెట్టి నిర్ధారించారు.
డ్యాన్ ఫ్రెండిన్‌బర్గ్‌తో పాటు మరో ముగ్గురు గూగుల్ ఉద్యోగులు ఉన్నారు. అయితే, మిగతా ముగ్గురు సురక్షితంగా ఉన్నట్లు ప్రకటించారు. డ్యాన్ ఫ్రెండిన్‌బర్గ్ కాలిఫోర్నియాలోని గూగుల్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నారు. అతను 2007 నుండి గూగుల్‌లో పని చేస్తున్నారు.

ఆచూకి కనుగొనే గూగుల్ టూల్
నేపాల్లో భూకంప ప్రభావానికి లోనయిన వ్యక్తుల యోగక్షేమాలను వారి ఆప్థులకు చేరవేసేందుకు, ఆచూకీ గల్లంతైన వారి గురించి వాకబు చేసేందుకు వీలుగా గూగుల్ కొత్త వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. విపత్తులో చిక్కుకొన్న వారిని రక్షించే ఉద్దేశ్యంతో ఈ వెబ్ ఆధారిత అప్లికేషన్ తెరిచింది.
ఇందులో ఐ యామ్ లుకింగ్ ఫర్ సమ్ వన్ (నాకు ఒకరి ఆచూకీ కావాలి), ఐ హావ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సమ్ వన్ (నా వద్ద ఒకరి వివరాలు ఉన్నాయి) అన్న రెండు అంశాలు ఉన్నాయి. వీటిలో సంబంధిత వ్యక్తుల వివరాలను ఉంచడం ద్వారా తప్పిపోయిన వారి గురించి వాకబు చేయవచ్చు.












Click it and Unblock the Notifications